మోసం చేసిన ప్రియుడు.. పెళ్లితో షాకిచ్చిన ప్రియురాలు?
దీంతో ఎంతో మంది యువతీ యువకులు ఇక ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారి దూరం అయ్యారు అని మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమించిన వారు లేని జీవితం వృధా అనుకుని భావిస్తూ ఏకంగా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం విభిన్నంగా ఆలోచించి అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఏంటి అనుకుంది ఆ యువతి. ఎవర్నో ప్రేమించటం ఎందుకు నన్ను నేను ప్రేమించుకుంటా అంటూ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని భావించిన ఆ యువతి చివరికి ప్రియుడు దూరం కావడంతో తనని తానే పెళ్లి చేసుకుంది.
ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. పాట్రిసియా క్రిస్టినె అనే 28 ఏళ్ల యువతి ఎనిమిదేళ్ల క్రితం యువకుడిని ప్రేమించింది. ఇక ఆ యువకుడితో ప్రేమలో మునిగి తేలింది. ఆ తర్వాత ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయింది. ఇంతలోనే ఇక బాయ్ ఫ్రెండ్ షాకిచ్చాడు. ఏకంగా ఆ యువతికి బ్రేకప్ చెప్పేసాడు. దీంతో ఆ యువకుడిని మర్చిపోలేక ఎన్నో రోజుల పాటు కుంగిపోయింది. అదే సమయంలో ఆ యువతికి బంధువుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. పెళ్లి చేసుకోవాలి అంటూ అందరూ వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఇక బంధుమిత్రులందరికీ సమక్షంలో ఏకంగా ఈ భగ్న ప్రేమికురాలు తనని తానే పెళ్లి చేసుకుంది.