ప్రజలు కోరుకున్నారు.. సీఎం చేశాడు.. మరి జగన్, కేసీఆర్ సంగతేంటి?

praveen
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండేవి.. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల కంటే ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపించడం లేదు.. తక్కువో.. ఎక్కువో ప్రైవేట్ స్కూల్స్ కి తమ పిల్లల్ని పంపించడానికి ఎక్కువగా తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఇలా విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు కూడా మూతపడిన పరిస్థితి ఏర్పడింది.

 అదే సమయంలో అటు సామాన్య మధ్యతరగతి ప్రజలకు మాత్రం ప్రైవేట్ స్కూల్ చదువులు ఎంతో భారంగా మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే అటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రతి ఒక సామాన్యుడు కోరుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇక ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ప్రత్యేక సాధించడంలో రిజర్వేషన్ వస్తే ఎంతో మంది అటు ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఆసక్తి చూపుతారని.. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో  చదివిన పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కూడా ఉంటుందని ప్రజలు ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వాలను అడుగుతూ వస్తున్నారు.

 కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి  ప్రజలు కోరుకున్నది చేసి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్య పరిచారు. సర్కారు బడుల్లో చదివే వారికి శుభవార్త చెప్పారు.  ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్,లా, ఫిషరీస్ లాంటి ప్రొఫెషన్ కోర్సుల్లో 7.5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తాము అంటూ ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. గ్రామాలకి చెందిన వారు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద వారికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని.. మంచి అవకాశాలు వస్తాయి అంటూ స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అటు  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cm

సంబంధిత వార్తలు: