అమ్మో..! రాబోయే రెండు నెలలు అంత ప్రమాదమా..?
మరోవైపు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. దేశంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్న ఆయన.. కరోనా థర్డ్ వేవ్ నుంచి బయటపడేందుకు వేగంగా టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలారా.. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి.. ఎందుకంటే భారత ప్రభుత్వం ఆస్తుల అమ్మకంలో తీరిక లేకుండా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మానిటైజేషన్ స్కీమ్ ద్వారా కేంద్రం ఆస్తులను ప్రైవేటుకు ఇవ్వడంపై రాహుల్ ఈ సెటైర్ వేశారు.
ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 67వేల 590 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 1, 539మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20లక్షల 7వేల 730కు చేరింది. తాజాగా 1, 140మంది కోలుకోవడంతో.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 19లక్షల 79వేల 504కు చేరింది. కరోనా వైరస్ బారిన పడి మరో 12మంది చనిపోయినట్టు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 14వేల 448 యాక్టివ్ కేసులున్నట్టు పేర్కొంది.
ఇక దాదాపు 16లక్షల మోడర్నా టీకాలను వినియోగించకుండా జపాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు 39 వయల్స్ లో కలుషితాలు కనుగొన్నట్టు ఆ దేశ వైద్యశాఖ పేర్కొంది. ఆగస్ట్ 16నుంచి ఇప్పటి వరకు 8 వ్యాక్సిన్ కేంద్రాల్లో వీటిని గుర్తించినట్టు పేర్కొంది. అయితే ఇంతవరకు టీకా భద్రత గురించి తమకు ఎలాంటి సమాచారం ప్రభుత్వం తరఫు నుంచి అందలేదని తాకేడా ఫార్మా సంస్థ తెలిపింది. తాకేడానే జపాన్ లో మోడర్నా పంపిణీ చేస్తోంది.