BSNL బంపర్ ఆఫర్.. డైలీ 2జిబి డేటా.. ఆపై కూడా ఫ్రీ?
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ గా కొనసాగుతున్న బిఎస్ఎన్ఎల్ ఇక ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు మెరుగైన సర్వీసులు అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పటివరకు టారిఫ్ ఛార్జీల విషయంలో కూడా బిఎస్ఎన్ఎల్ గత కొంతకాలం నుంచి ఆకర్షణీయమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మరో అదిరిపోయే ఆఫర్ తో కస్టమర్ల ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఈ ఆఫర్ ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మిగతా టెలికాం రంగ సంస్థ లతో పోల్చి చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పాలి. తక్కువ రీఛార్జ్ ప్లాన్ తోనే మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
నేను చెప్పేది వింటుంటే ఆ టారిఫ్ ప్లాన్ గురించి తెలుసుకోవాలి అని ఆత్రుతగా ఉంది కదా.. ప్రస్తుతం ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు కోసం తీసుకొచ్చిన అద్భుతమైన ఆఫర్ ఏంటి అంటే.. 187 రూపాయలతో రీఛార్జి ప్లాన్స్.. 28 రోజుల వరకూ వాలిడిటీ ఉంటుంది.. ఇక ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి ప్రతిరోజు 2gb హై స్పీడ్ డేటా పొందేందుకు అవకాశం ఉంది.. అంతేకాదు ఇక 2 జిబి డేటా అయిపోయిన తర్వాత చింతించాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే రోజువారి డేటా ముగిసిన తర్వాత కూడా అపరిమితంగా బ్రౌసింగ్ చేసుకోడానికి అవకాశం ఉంది. అయితే ఇక హై స్పీడ్ తో కాకుండా కాస్త స్పీడ్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు పంపుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది.