చిన్నారులకు కరోనా టీకా.. అప్పుడేనట?

praveen
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో శరవేగంగా జరుగుతుంది.  చైనా నుంచి భారత్ కి పాకిపోయిన కరోనా వైరస్  రూపాంతరం చెందుతూ మళ్లీ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ తో పోరాటానికి భారత్ సిద్ధమైపోతుంది. ఈక్రమంలోనే వ్యాక్సిన్ అనేది ఎంతో కీలకంగా మారింది.  దీంతో ఇక ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు కదిలింది. దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక ప్రస్తుతం దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుంది  కేంద్ర ప్రభుత్వం.  ఇక  ప్రజల్లో కూడా వ్యాక్సిన్ పై అవగాహన పెరిగి పోవడంతో ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.



 అయితే ఇప్పటివరకు 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు మూడు రకాల వ్యాక్సిన్లు భారత్లో అత్యవసర వినియోగంలో ఉన్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇక మూడవ వేవ్ ముంచుకొస్తుందని ముఖ్యంగా చిన్నారుల పైన ఎక్కువ ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో అటు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ అందించడం  ఎంతో మేలు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  దీనిపై పరిశోధనలు కూడా జరుపుతున్నారు.  చిన్నారులకు టీకా లు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని భారత ప్రజానీకం కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది.


 అయితే చిన్నారులకు కరోనా టీకా సెప్టెంబర్ చివరి వారం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రియా అబ్రహం తెలిపారు  రెండేళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లల పై భారత్ బయోటెక్ ఇప్పటికే వ్యాక్సిన్ తో క్లినికల్ ట్రయల్స్ చేపట్టిందని వాటి ఫలితాలు మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం పూణేలోనే కరోనా వైరస్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు mRNA టీకాలను పన్నెండేళ్లు దాటిన వారికి అటు విదేశాలలో ఇస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: