ఆఫ్ఘానిస్థాన్ పేరు మారబోతోంది.. కొత్త పేరు ఇదే..!
మరోవైపు ఆప్ఘానిస్థాన్ లో అందరినీ కలుపుకొని తాలిబన్లు ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన చైనా.. కొన్ని గంటల్లోనే భిన్నంగా స్పందించింది. తాలిబన్లు ఎట్టి పరిస్థితుల్లో దేశంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరించింది. భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిష్కారాని అయినా ఇదే మూలమని స్పష్టం చేసింది. తాలిబన్లు ఇచ్చిన హామీలపై నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇక ఆప్ఘానిస్థాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు జర్మనీ షాక్ ఇచ్చింది. ఆప్ఘానిస్థాన్ అభివృద్ధి కోసం ప్రకటించిన 3వేల 763కోట్ల రూపాయల సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. దీంతో అతిపెద్ద దాత నుంచి ఆప్ఘానిస్థాన్ దేశానికి ఆర్థిక సాయం నిలిచిపోనుంది. ఈ మొత్తం స్థానిక పోలీసు బలగాల శిక్షణకు న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. అలాగే మహిళల హక్కుల రక్షణ, అవినీతిపై పోరుకు ఉఫయోగించేందుకు ఉద్దేశించబడింది.
అంతేకాదు ఆప్ఘానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇంకా అధికారం చేపట్టకముందే.. ఆ దేశంలో తిరుగుబాటు మొదలైనట్టు తెలుస్తోంది. ఆప్ఘాన్ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ ఆధ్వర్యంలో ఈ తిరుగుబాటు ప్రారంభమైందని సమాచారం. చారికల్ ప్రాంతన్ని ఆఫ్ఘాన్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి మీడియా ద్వారా తెలుస్తోంది. దీంతో పాటు పంజ్ షీర్ ప్రాంతంలో ఆఫ్ఘాన్ సైన్యం దాడులు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. మొత్తానికి తాలిబన్లు ఆఫ్ఘానిస్థాన్ లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించేశారు. పలు రకాల నిర్ణయాలతో అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. చూద్దాం.. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో..