సీఎం జగన్ ఇచ్చిన ఉద్యోగం ప్రాణం తీసింది.. ఇంకా ఎన్ని ప్రాణాలో?

praveen
వైసీపీ అధికారంలోకి వస్తే తమ బతుకులు మారిపోతాయి అని ఎంతగానో మురిసిపోయారు..  ఇక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనడంతో పులకించిపోయారు.. తాము చదువుకున్న చదువుకు ఇప్పటికైనా ప్రతిఫలం దక్కుతుంది అని అనుకున్నారు..  అనుకున్నట్లుగానే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. లక్షా 30 వేల మందికి పైగా గ్రామ వార్డు వాలంటీర్లను ఉద్యోగాల్లో నియమించింది.  దీంతో అప్పటి వరకూ బాగా చదువుకున్నప్పటికి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పాడినవారు వాలంటీర్లుగా  మారారు.

 అయితే వాలంటీర్లకు అటు ప్రభుత్వం తక్కువ జీతం ఇచ్చింది.. అయినప్పటికీ వాలంటీర్లు అందరూ కూడా ఎంతో చెమటోడ్చి పని చేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం వరాలు కురిపించి ఎప్పటికైనా తమ బతుకులు మార్చక పోతుందా అని ఆశతో ఉన్నారు. కానీ జగన్ ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగమే ప్రస్తుతం ఎంతో మందికి బతుకులను భారం చేస్తుంది.  సీఎం జగన్ ఇచ్చిన ఉద్యోగమే ఇక ఇప్పుడు జీవితమే వృధా అనే ఆలోచన తీసుకొస్తుంది. సీఎం జగన్ కి ఇచ్చిన ఉద్యోగమే చివరికి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిసే పరిస్థితిని తీసుకొస్తుంది. వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం వేతనంగా ఇస్తున్న ఐదు వేల రూపాయలు సరిపోక ప్రస్తుతం ఎంతో మంది వాలంటీర్లు  ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక్కడ జగన్ ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగం మరో యువకుడి ప్రాణాలు తీసింది. అంతేకాదు ఇక తమ కొడుకు పైనే ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు అరణ్యరోదన మిగిల్చింది. అనంతపురంలో ఇటీవల ఓ వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే కర్నూలులో మరో వాలంటీర్ సూసైడ్ చేసుకుకున్నాడు. వాలంటీర్ గా పనిచేస్తున్న హబీబ్ భాషా అనే 26 ఏళ్ల కుర్రాడు  తన జీవితాన్ని అర్ధాంతరంగానే ముగించాడు. ఇక తనకు పెళ్లి అయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఐదు వేల జీతంతో కుటుంబాన్ని పోషించే లేనని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు . దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వ పథకాల పేరుతో జనాలకు భారీగా డబ్బులు పంచుతున్న జగన్..  ప్రభుత్వాన్ని నమ్ముకొని పనిచేస్తున్న వాలంటీర్ల బతుకులు కూడా కాస్త మారిస్తే బాగుంటుందని అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: