అమ్మో మోడీ : పెద్దలు చెప్పిందే కరెక్ట్.. కాంగ్రెస్ బెస్ట్?
వామ్మో.. ఇవేం ధరలు.. ఇలా ఉంటే సామాన్యుడు బ్రతక గలడా.. ఇంత ధరలు పెంచి సామాన్యుడి చంపేస్తారా ఏంటి.. సామాన్యుడికి ఎవరూ లేరు అనుకుంటున్నారా.. మేమున్నాం.. సామాన్యుడికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటామ్.. మీ ప్రభుత్వంలో సామాన్యులకు ఎంత అన్యాయం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. అప్పుడు anni సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొస్తాం.. ప్రజా సంక్షేమ పాలన సాగిస్తామ్.. ఈ మాటలు అన్ని ఎవరో చెప్పినవి కాదు.. సరిగ్గా 2014లో అధికారంలోకి రాకముందు బిజెపి పెద్దలందరూ చెప్పినవి. అయితే అంతకు ముందు ప్రభుత్వం హయాంలో ఉన్న ధరలు అందరికీ అందుబాటులోనే ఉన్నప్పటికీ.. ఇక అప్పుడు బిజెపి పెద్దలు చెప్పిన మాటలు మాత్రం అందరిని ఆకర్షించాయి.
అవునేమో నిజంగానే బీజేపీ వస్తే ఇక బతుకులు మారుతాయేమో.. అందరూ కలలు కన్నా జీవితం కళ్ళ ముందు వాలి పోతుందేమో అని అనుకున్నారు అందరు. వద్దు వద్దు కాంగ్రెస్ ప్రభుత్వమే మేలు అని పెద్దలు చెబుతున్నా వినకుండా ఓట్లు వేసి బీజేపీ గెలిపించి మోదీని కేంద్రంలో గద్దెనెక్కించారు. ఇక అప్పుడు మొదలైన బాదుడు ఇప్పటికీ ఆగడం లేదు. నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందనంత దూరంలో కి వెళ్లిపోయాయి. ఇక పెట్రోల్ ధరలు నిప్పు అంటించుకునే భగ్గుమంటున్నాయి. ఇక గ్యాస్ ధరలు ఎవరెస్టు శిఖరం ఎక్కుతున్నాయి. ఇలా ప్రతి ఒక్కటి సామాన్యుడికి భారంగానే మారిపోయింది. ఇక మరోవైపు దేశం మొత్తం ఇక అప్పుల ఊబిలో కూరుకు పోతుంది. ఇవన్నీ చూస్తుంటే అవునవును నిజంగా అప్పుడు పెద్దలు చెప్పింది విని ఉంటే పరిస్థితి ఇప్పటి వరకు వచ్చేది కాదేమో అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు.