నేడు హుజూరాబాద్ నియోజక వర్గంలో తెలంగాణ ఆర్థిక మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ లోని శ్రీరాంపూర్ బ్రిడ్జి క్యాంప్ ఆఫీసు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఉదయం 11 గంటల సమయంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు మంత్రి హరీశ్ రావు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేయనున్నారు మంత్రి హరీశ్ రావు. అనంతరం జమ్మికుంట మీదుగా భారీ ర్యాలీతో ఇల్లందకుంటకు చేరుకోనున్న మంత్రి హరీశ్ రావు...అక్కడి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
తదనంతరం వీణవంకలో నిర్వహించే మహిళల సభలో మంత్రి హారీష్ రావు పాల్గొని.. ప్రసంగం చేయనున్నారు. అయితే.. మంత్రి హారీష్ రావు హుజురాబాద్ పర్యటనతో ఆ నియోజక వర్గంలో ఒక్క సారిగా రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ శిబిరంలో కొత్త అలజడి మొదలైనట్లు సమాచారం అందుతోంది. ట్రబుల్ షూటర్ హారీష్ రావు ఎక్కడ అడుగు పెడితే... అక్కడ.. టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. ఈ తరుణంలో హారీష్ రావు హుజురాబాద్ నియోజక వర్గ పర్యటన... ఈటల రాజేందర్ కు కొత్త టెన్షన్ మొదలైంది. ఇవాళ్టి మంత్రి హారీష్ రావు పర్యటన తో... హుజురాబాద్ ఓటర్లు టీఆర్‌ఎస్ పార్టీకి మళ్లే అవకాశాలు ఉంటాయి.
ఎందుకంటే.. మంత్రి హారీష్ రావుకు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న.. ఫేమ్ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి హారీష్ రావు కు ఉండటం గమనార్హం. అలాగే...దుబ్బాక మినహా ఇప్పటి వరకు హారీష్ రావు బాధ్యతలు తీసుకున్న ఏ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ ఎక్కడా ఓడిపోలేదు. ఇలాంటి సమీకరణాల్లో మంత్రి హారీష్ రావు హుజురాబాద్ నియోజక వర్గంలో పర్యటించనున్నారు. మంత్రి హారీష్ రావు పర్యటన హుజురాబాద్ ప్రజలను కచ్చితంగా ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. అలాగే...హుజురాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ నేతల్లోనూ.. ఫుల్ జోష్ నింపుతుంది. అంతేకాదు.. హారీష్ రావు పర్యటన అనంతరం..ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ మరింత దూసుకుపోయే అవకాశాలు స్పష్టం గా ఉన్నాయి.