రేవంత్ రెడ్డి... తెలంగాణ రాష్ట్రంలో క్రేజ్ వున్న డైనమిక్ లీడర్. అలాగే మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లో ముందుండే దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి. ఈ అన్ని కోణాలను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం... నెల కింద రేవంత్ రెడ్డికి తెలంగాణ పిసిసి అధ్యక్ష పగ్గాలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి... పూర్వ వైభవం తీసుకురాగల... లీడర్ రేవంత్ అని కాంగ్రెస్ అధిష్టానం నమ్మింది. ఈ నేపథ్యంలోనే పిసిసి పదవిని కట్టబెట్టింది. అయితే తెలంగాణ పి సి సి పదవి చేపట్టిన అప్పటినుంచి రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ... పూర్వవైభవం తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న టిఆర్ఎస్ కోవర్టు నేతలను టార్గెట్ చేశారు. అలాగే కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో కి జంప్ అయిన ఎమ్మెల్యేల పై కూడా నజర్ పెట్టారు. ప్రతినిత్యం కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్ రెడ్డి ఎండగడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే... ఇవాల్టి నుంచి... దళిత గిరిజన దండోరా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని మరియు గిరిజన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున... ప్రభుత్వం ఇవ్వాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.అలాగే తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో దళిత బందు పథకాన్ని కేసీఆర్ సర్కార్ అమలు చేయాలని కూడా ఈ కార్యక్రమంలో భాగమే.
ఇందులో భాగంగానే ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి లో లక్షమందితో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఇంద్రవెల్లి లో ప్రారంభమయ్యే దళిత గిరిజన దండరా యాత్ర సెప్టెంబర్ 17న ముగుస్తుంది. అయితే ఈ దళిత గిరిజన దండోరా కార్యక్రమం రేవంత్ రెడ్డి కి ఏ మేరకు క్రేజ్ తీస్తుందోనని అందరూ అనుకుంటున్నారు. సీఎం కేసీఆర్... తీసుకు వచ్చిన దళిత బంధు పథకం నేపథ్యంలోనే... రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరాకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా దళితులకే కాకుండా గిరిజనులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ తో రేవంత్ రెడ్డి ముందుకు వస్తున్నారు. దీంతో దళితుల తోపాటు గిరిజనులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు తీసుకు వస్తే..రేవంత్ కె కాకుండా కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ దళిత గిరిజన దండరా.. రేవంత్ కు ఏ మేరకు క్రేజ్ తెస్తుందో చూడాలి.