సీఎం షాకింగ్ నిర్ణయం.. వాళ్ల ఉద్యోగాలు ఊస్ట్?
ముఖ్యంగా ఘోరమైన నేరచరిత్ర కు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని.. అసలు నేరాలే జరగని రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీలు గ్యాంగ్ స్టార్స్ ని ఎన్కౌంటర్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గ్యాంగ్ స్టర్ గా చలామణి అవుతూ ప్రజలను హింసిస్తూ ఎంతో మంది వ్యాపారులు ఉద్యోగులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వారిని ఎన్కౌంటర్ చేయడంపై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. కానీ అటు యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
సాధారణంగా గ్యాంగ్ స్టర్స్ రెచ్చిపోతున్నారు అంటే వాళ్లకు సంబంధించి పోలీసు విభాగంలో అటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎంతో మంది ఉద్యోగులు కూడా పని చేస్తూ ఉంటారు. వాళ్ల తోడ్పాటు కారణంగానే ఎన్నో అరాచకాలు చేస్తూ ఉంటారు గ్యాంగ్ స్టార్స్. ఇక ఇటీవల ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులపై కూడా దృష్టి సారించింది. గ్యాంగ్ స్టార్స్ తో కలిసి ప్రయాణం చేసినటువంటి 222 మంది పోలీసులను గుర్తించింది. ఇటీవల ప్రభుత్వం వారిని పూర్తిగా తీసేసింది. అంతేకాదు గ్యాంగ్ స్టర్స్ రౌడీలు స్వాధీనం చేసుకున్నటువంటి భూములకు పత్రాలు జారీ చేసినట్టు వంటి 500 మంది అధికారులను కూడా ఉద్యోగాల నుంచి తొలగించింది యోగి ప్రభుత్వం మరో సంచలనం సృష్టించింది.