కార్గిల్ విజయ్ దివాస్.. భారత విజయానికి 21 ఏళ్లు?

praveen
మంచు కొండల మాటున అగ్గి రాజేసి.. ఉగ్రవాదుల ముసుగులో భారత్ పై ఆధిపత్యం సాధించి.. ప్రజాస్వామ్యాన్ని రూపు మాపి చివరికి మత రాజ్యస్థాపన చేయాలని పాకిస్థాన్ గుంట నక్కలా కుట్ర చేసింది. కానీ పాకిస్తాన్ కుట్రలను ఎదిరించేందుకు భారత సైన్యం మొత్తం సింహంలా గర్జించింది. పాకిస్తాన్ సైన్యం పై సింహం పంజా ని విసిరినట్లుగా  దాడి చేసింది  దాయాది దేశం కి తగిన గుణపాఠం చెప్పి ఘనవిజయం సాధించింది భారత్. ఇండియా సాధించిన ఈ గొప్ప విజయానికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. భారత్ చేతిలో ఓటమి కూడా ఒప్పుకోలేక పోయింది పాకిస్తాన్.

 భారత్తో పోరాడింది తమ సైనికులు కాదు కాశ్మీర్ స్వాతంత్రం కోసం ఆలోచించే  వారే అంటూ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పాకిస్తాన్ నక్కజిత్తుల వ్యూహాలను ఎరిగిన ప్రపంచం భారత విజయాన్ని స్వాగతించింది. ఉగ్రవాదులతో కలిసి కాశ్మీర్ ప్రాంతంలో కార్గిల్ సెంటర్ను ఆక్రమించింది పాకిస్తాన్ సైన్యం  వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టింది. ఇక ఈ యుద్ధంలో ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా జూలై 26 వ తేదీన భారతీయులందరికీ గౌరవం, త్రివర్ణపతాకం కార్గిల్ గడ్డపై ఎగిరిన రోజు.. మేరా భారత్ మహాన్ అంటూ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరిన రోజు.. కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ సైన్యాన్ని ప్రాణ భయం ఏంటో రుచి చూపించి భారత్ ఆర్మీ తరిమికొట్టిన రోజు.

 సముద్ర మట్టానికి 18 వేల అడుగుల ఎత్తులో ఉండే అత్యంత శీతల వాతావరణంలో మనుషులు జీవించడానికి సరైనది కాదని.. శీతాకాలంలో సైనిక శిబిరం ఖాళీ చేయాలన్నది పాకిస్తాన్ భారత్ మధ్య కుదిరిన ఒప్పందం. 1999లో ఇదే ఒప్పందాన్ని తమకు అనుకూలంగా చేసుకొని భారత్ ను దెబ్బకొట్టాలని పాకిస్థాన్ ప్రయత్నించింది. ఈ క్రమంలోనే శీతాకాలానికి ముందు పలు ప్రాంతాల నుంచి భారత బలగాలు వెనక్కి వచ్చాయి. ఈ క్రమంలోనే తమ కుట్ర అమలుచేసింది పాక్. ఏకంగా భారత్ పాకిస్తాన్ సైన్యం చొచ్చుకొని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. అప్పుడు ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పై ఇక భారత సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. కొన్ని వందల మంది సైనికులు ఓవైపు ప్రాణాలు కోల్పోతున్నా.. భారత ఆర్మీ ఎంతో వీరోచితంగా పోరాడి భారత గౌరవాన్ని నిలబెట్టి దాయాది దేశం పై విజయం సాధించింది భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: