స్టాలిన్ వ్యూహాలతో ఆ రాష్ట్రం ప్రశాంతంగా ఉందా..?

MOHAN BABU
 తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. కోపతాపాలు, పగలు ప్రతీకారాలతో నేతలంతా రగిలి పోతూ ఉంటారు. కానీ గత రెండు నెలల నుంచి తమిళనాడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. దీనికి కారణం ముఖ్యమంత్రి స్టాలిన్ అని చెప్పవచ్చు. స్టాలిన్ తమదైన శైలిలో రాజకీయాల నడుపుతున్నాడు. రాబోవు ఒక పది సంవత్సరాల కాలం పాటు  తనకు ఎదురు లేకుండా చేసుకుంటూ పాలన కొనసాగిస్తున్నాడు. విపక్షాలను సైతం గౌరవిస్తూ, వారి ఆలోచనను సైతం అడుగుతూ పాలన కొనసాగిస్తూ వస్తున్నాడు.

ఇదే ఆయనకు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ప్రశాంతంగా ఉండేలా చేస్తున్నాయి. స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత  తన స్టైల్ మార్చాడు. ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ప్రతి నిర్ణయం వెనుక  విపక్షాల పాత్ర ఉండేలా  ముందుచూపుతో వ్యవహరిస్తున్నాడు. తమ శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తులను సైతం మిత్రులుగా మార్చుకుంటూ  స్టాలిన్ సక్సెస్ అవుతున్నారు అని చెప్పవచ్చు. తమిళనాడు రాష్ట్రంలో  ఇప్పుడైతే ఎన్నికల ఏమీ లేవు. కమలహాసన్ పార్టీ విషయానికొస్తే కనీసం దాని ఆనవాళ్ళు కూడా లేకుండా కనుమరుగైపోయాయి. రజనీకాంత్  తను రాజకీయాల్లోకి రానని చెప్పేశారు. స్టాలిన్ కున్నటువంటి ప్రత్యర్థి అన్నాడీఎంకే మాత్రమే. అన్నా డీఎంకే పార్టీలో  తీవ్రమైన నాయకత్వ సమస్య వెంటాడుతోంది. ఒకవేళ శశికళ చేతిలో పార్టీ పగ్గాలు పెట్టిన అను స్టాలిన్ ఎదుర్కొనే ఎంత శక్తి లేదన్నది కూడా వాస్తవమే.

కొటారి గ్రూప్ పదాలతో ఆ పార్టీ మరో ఐదేళ్ళ పాటు  ఇబ్బందులు ఎదుర్కోవాల్సినదే. అందుకే స్టాలిన్ మరోసారి అధికారాన్ని నిలుపుకునేందుకు  ముఖ్యమంత్రి కుర్చీ పెట్టినప్పటి నుంచి తన స్టంటును  ప్రారంభించాడు.  ఒక రకంగా చెప్పాలంటే  స్టాలిన్ వైఖరి అన్నాడీఎంకే కూడా మింగుడు పడడం లేదు. తన పార్టీకి సూదీర్ఘకాలంగా రాజకీయ శత్రువులుగా ఉన్న డీఎంకే అధినేత విజయకాంత్ ను కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే స్టాలిన్ ముందుచూపు అనేది మరో పదేళ్లపాటు స్టాలిన్ పాలిస్తాడు అనేది కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: