నన్ను చంపడానికి మంత్రి కుట్ర.. ఈటెల షాకింగ్ కామెంట్స్?

praveen
ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరిన తర్వాత తెలంగాణ రాజకీయాలు మొత్తం హాట్ హాట్ గా మారిపోయాయి. అంతేకాదు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాడు ఈటల రాజేందర్. దీంతో ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక కాస్త అటు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. దీంతో అటు హుజూరాబాద్ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాకముందే ఇప్పటికే వాతావరణం హాట్ హాట్ గా మారిపోయింది. అంతేకాకుండా కూడా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఈటెల రాజేందర్.



 ఈ క్రమంలోనే హుజూరాబాద్ నియోజకవర్గం లో పాదయాత్ర నిర్వహించి ఇక ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకోవాలని ఇటీవలే ఈటెల రాజేందర్ నిర్ణయించారు . ఈ నేపథ్యంలోనే  ఎంతోమంది అభిమానులు కార్యకర్తలతో ఈటెల రాజేందర్ నిర్వహిస్తున్న పాదయాత్ర కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇటీవలే పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో మాట్లాడిన ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో జాగ్రత్తగా ఉండాలని తనకు మాజీ నక్సలైట్ సమాచారం ఇచ్చాడు అంటూ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.



 తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నారు అన్న విషయాన్ని మాజీ నక్సలైట్ సమాచారం అందించాడు అంటు షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈటెల రాజేందర్.  మంత్రి ఏకంగా హత్య చేసే ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు అన్న సమాచారం కూడా తన వద్దకు వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు ఈటెల. నరహంతకుడు అయినా నయీమ్ బెదిరిస్తే నే తాను భయపడలేదని.. ఇప్పుడు ఇలాంటి బెదిరింపులకు కూడా తాను ఎప్పుడూ భయపడను అంటూ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. ఇకపోతే మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికార టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: