రైస్ ఆఫ్ హెవెన్.. చైనా కొత్త ప్రయోగం?

frame రైస్ ఆఫ్ హెవెన్.. చైనా కొత్త ప్రయోగం?

praveen
సాధారణంగా అన్ని దేశాలు కూడా ఇక అంతరిక్షంలో ఎన్నో వినూత్న మైన ప్రయోగాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అగ్రరాజ్యాలు ఇక అంతరిక్షంలో పంటలు పండించడం లేదా మానవుల నివసించేందుకు అనువైన భూమిని గుర్తించడం లాంటివి తెలుసుకునేందుకు ఎన్నోసార్లు ఇక రాకెట్ ప్రయోగాలు చేస్తూ ఉంటాయి. ఇలా వివిధ దేశాల అంతరిక్ష సంస్థ చేసిన ప్రయోగాలు కొన్నిసార్లు విజయవంతం అవుతాయ్. కొన్నిసార్లు మాత్రం నిరాశే మిగులుతుంది.  అయితే ప్రస్తుతం అగ్ర రాజ్యాల లో ఒకటిగా కొనసాగుతున్న చైనా కూడా ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటుంది.



 ఇటీవలే ఒక వినూత్నమైన ప్రయోగంతో చైనా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా ఎన్నో రోజుల పాటు రోదసిలో నిల్వ ఉంచిన విత్తనాలతో వంటలు తయారు చేసేందుకు సిద్ధమౌతుంది చైనా. దీని కోసం ఇటీవలే ఒక వినూత్నమైన ప్రయోగానికి సిద్ధమైంది చైనా. ఎన్నో రోజుల పాటు రోదసిలో  కొన్ని రకాల విత్తనాలను నిల్వ ఉంటుంది.  ఇటీవలే రోదసి నుంచి ఆ విత్తనాలను భూమి మీదకు తీసుకు వచ్చింది. అయితే ఇక ఈ విత్తనాలను రైస్ ఆఫ్ హెవెన్ అనే పేరు పెట్టింది చైనా.  ఇక ఈ విత్తనాలతో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది.



 కొన్నాళ్లపాటు రోదసిలో ప్రత్యేకమైన ఉష్ణోగ్రతలో 40 గ్రాముల తిండి గింజలను చైనా నిల్వ ఉంచుతుంది. అయితే ఇటీవలే ఈ 40 గ్రాముల తిండి గింజలను చైనాకు తీసుకొచ్చింది. అయితే గింజలతో చైనా శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సౌత్ శాస్త్రవేత్తలు రోదసి నుంచి చైనాకు చేరుకున్న ఈ 40 గ్రాముల తిండి గింజల తో ప్రత్యేకమైన పంట సాగు చేపట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇక దీనికి రైస్ ఆఫ్ హెవెన్ అనే పేరు పెట్టారు. అయితే ఈ ప్రయోగం ఫలితం ఎలా ఉంటుంది అన్నది తెలియాలంటే మరి కొన్ని నెలలు ఆగాల్సి ఉంటుంది. అయితే ఈ రైస్ అటు మార్కెట్ లోకి రావాలి అంటే దాదాపు మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది అని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: