చంద్రబాబు, లోకేష్ లపై.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొస్తానని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే తెలుగు ను నిర్వీర్యం చేసింది జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  అయితే ఇటీవల జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగు అకాడమీ పేరును మారుస్తూ తెలుగు సంస్కృత అకాడమీ గా ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక తెలుగు అకాడమీ పేరు మార్చడం పై  ప్రతిపక్ష పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.


 రాష్ట్రంలో తెలుగులో పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అటు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంటూ విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు.  పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం.. ఇక ఇప్పుడు తెలుగు అకాడమీ పేరుని మార్చడం చూస్తుంటే తెలుగు నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవలే ప్రతిపక్షాల విమర్శలు పై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం తెలుగు ప్రజలందరూ సంస్కృతంతో కూడిన తెలుగు భాషను మాట్లాడుతుంటారు అంటూ తెలిపారు ఆమె.  ఇప్పుడు కాదు ఎన్నో రోజుల నుంచి తెలుగు సంస్కృతం కలిసే మాట్లాడుతున్నారు  రెండు భాషలను విడదీయడం కష్టం.


 అందుకే జగన్ ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరు మర్చి తెలుగు సంస్కృత అకాడమీ అని పేరు పెట్టింది. కానీ దీనిపై అటు రాజకీయ పార్టీల నేతలు మాత్రం కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు  ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు  తెలుగు సంస్కృత అకాడమీ కి సంబంధించిన అంశాన్ని రాజకీయ లబ్దికోసం వాడుకోవద్దు అంటూ లక్ష్మీపార్వతి సూచించారు. తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్పష్టంగా చెప్పాలని ఆమె కోరారు. తెలుగు అకాడమీ పేరు మార్పు పై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్ లకు అసలు తెలుగు భాష పై అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. పీవీ నరసింహారావు రూపొందించిన బైలా ప్రకారం నిర్ణయాలు తీసుకున్నామని చంద్రబాబు లోకేష్ ఒకసారి అది చదివితే బాగుంటుంది అంటూ విమర్శలు చేశారు లక్ష్మీపార్వతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: