బాబుతో రేవంత్‌కు కష్టమే...ఎటాక్ చేసిన లాభం లేదా?

M N Amaleswara rao
తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. అందుకే అక్కడ టీడీపీకి మనుగడ లేకుండా పోయింది. బాబు ఎన్ని రకాలు ప్రయత్నాలు చేసిన టీడీపీని నిలబెట్టలేకపోయారు. ఆఖరికి 2018లో బద్ధ శత్రువు కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకుని బాబు ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు.

ఆ తర్వాత నుంచి చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. అయితే తాజాగా టీపీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో, చంద్రబాబు పేరు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో మార్మోగుతుంది. రేవంత్, చంద్రబాబు మనిషి అని, బాబు చెప్పడం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌కు పీసీసీ ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి.

అయితే ఆ విమర్శలని పట్టించుకోకుండా రేవంత్ దూకుడుగా, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నుంచి కూడా రేవంత్‌కు కౌంటర్లు వస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావులు సైతం రేవంత్‌ని టార్గెట్ చేసి మాట్లాడుతూ, చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో మళ్ళీ తెలంగాణలో రాజకీయాలు చేయడానికి వస్తున్నారని అంటున్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబుని తరిమికొట్టిన సరే, రేవంత్ ద్వారా మళ్ళీ రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రేవంత్‌కు టీడీపీ వాసన పోలేదని అంటున్నారు. ఇక రేవంత్ సైతం టీఆర్ఎస్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. తాను చంద్రబాబు మనిషి అని అయితే, కేసీఆర్ చంద్రబాబుకు చప్రాసీ అని ఫైర్ అయ్యారు.

టీఆర్ఎస్‌లో 75 శాతం మంత్రులు టీడీపీకి చెందినవారే అని, ఆ పార్టీలో సగంపైనే నాయకులు టీడీపీ నుంచి వచ్చినవారే అని అంటున్నారు.  ఇలా రేవంత్, టీఆర్ఎస్‌పై ఎదురుదాడికి దిగారు. కానీ రేవంత్ ఇలా ఎటాక్ చేసిన ఉపయోగం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. రేవంత్, బాబు మనిషి అని ముద్ర తొలగించుకోవాలని, ఎందుకంటే బాబుని తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదని, అలాంటప్పుడు అది రేవంత్‌కే నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో రేవంత్ రాజకీయాలు ఎలా ఉంటాయో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: