అలా జరిగితే...రఘురామ రూట్ మారుతుందా?
ఇప్పటికే పలుమార్లు లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. రఘురామపై వేటు వేయాలని లేఖలు రాశారు. తాజాగా కూడా వైసీపీ ఎంపీలు మరొకసారి స్పీకర్‌ని కలిసి రఘురామని ఎంపీ పదవి నుంచి తొలగించాలని కోరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామని డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాది నుంచి ఫిర్యాదు చేస్తున్న స్పీకర్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
ఇదే అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. స్పీకర్ న్యాయం చేయకపోతే, పార్లమెంట్‌లో సైతం ఆందోళనకు దిగుతామని అంటున్నారు. అయితే వాస్తవ పరిస్తితులని చూస్తే స్పీకర్, రఘురామపై వేటు వేసేలా కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రఘురామకు బీజేపీ పెద్దలతో సత్సబంధాలు ఉన్న మాట వాస్తవం. దీంతో రఘురామ వేటు పడకుండా తప్పించుకుంటున్నారు.
ఒకవేళ అలాంటి పరిస్తితి వస్తే రఘురామ బీజేపీ వైపుకు వెళ్ళే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. అసలు ఎలాగైనా అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికే రఘురామ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా వైసీపీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తుంటే, అపోజిట్‌లో తనపై వేటు వేయొద్దని రఘురామ స్పీకర్‌కు లేఖలు రాస్తున్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని చెబుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులని మాత్రం ఎత్తిచూపిస్తున్నానని అంటున్నారు. ఈ విధంగా వైసీపీ ఎంపీలు ఒక రూట్‌లో వెళుతుంటే, రఘురామ మరో రూట్‌లో వెళుతూ వేటు పడకుండా తప్పించుకుంటున్నారు.