ఒలింపిక్స్ నిర్వహకులు కీలక నిర్ణయం..!

NAGARJUNA NAKKA
ప్రభాస్, కాజల్‌ కెమిస్ట్రీకి ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉంది. వీళ్లిద్దరు కలిసి నటించిన 'డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఏడాది గ్యాప్‌లో రిలీజైన ఈ సినిమాలతో ప్రభాస్, కాజల్‌కి మంచి ఫ్రెండ్‌షిప్ డెవలప్ అయ్యింది. అయితే కొన్నాళ్ల తర్వాత ఈ ఫ్రెండిషప్‌ లవ్‌గా మారిందని అప్పట్లో ప్రచారం జరిగింది.

అప్పట్లో ప్రభాస్, కాజల్‌ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని ఇండస్ట్రీ జనాలు కూడా అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో వీళ్లిద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగిందని చెప్తారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేయలేదు.  కాజల్‌ ఒక రూట్‌లో ట్రావెల్‌ చేస్తే, ప్రభాస్‌ మరో దారిలో వెళ్లాడు. అయితే ఇప్పుడు 'సలార్' కోసం మళ్లీ వీళ్లిద్దరు కలుస్తున్నారని చెప్తున్నారు.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ 'సలార్' సినిమా చేస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 'కెజిఎఫ్' తర్వాత ప్రశాంత్‌ నీల్‌ డైరెక్ట్ చేస్తోన్న 'సలార్' కూడా మైనింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కాజల్‌ ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందని చెప్తున్నారు.

కాజల్ హీరోయిన్‌గా కెరీర్‌ మొదలుపెట్టి 14 ఏళ్లు దాటింది. అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క 'జనతాగ్యారేజ్' సినిమాలో మాత్రమే స్పెషల్‌ సాంగ్ చేసింది. పక్కాలోకల్ సాంగ్ తర్వాత మళ్లీ ఐటెమ్ సాంగ్స్‌ చెయ్యలేదు. జూ.ఎన్టీఆర్ కోసమే పక్కాలోకల్ స్టెప్పులేశానని, మళ్లీ ఐటెమ్‌ సాంగ్స్‌ చెయ్యనని చెప్పింది. కానీ మళ్లీ ఇప్పుడు ప్రభాస్ 'సలార్'లో సాంగ్ చెయ్యబోతోంది కాజల్.

'సలార్' సినిమాలో కాజల్ స్పెషల్‌ సాంగ్‌ అనే టాక్ వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. పదేళ్లు డిస్టెన్స్ మెయింటైన్ చేసిన వీళ్లిద్దరిమధ్య, వివాదం సమసిపోయిందా.. కాజల్ ఇప్పుడు మిసెస్ గౌతమ్‌ కిచ్లూగా మారిపోయింది కాబట్టి, ఇంక పాత గొడవలని పక్కనపెట్టేసిందా అని మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మళ్లీ వీళ్ల మధ్య కెమిస్ట్రీ ఏమాత్రం వర్కవుట్ అవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: