ఛీ.. ఛీ.. వీళ్ళు మనుషులేనా.. సొంత కూతుర్లనే ఎలా కొట్టారో చూడండి?
నాగరిక సమాజంలో కూడా మహిళల పట్ల ఎంతో అనాగరికంగా వ్యవహరిస్తున్నారు సాటి మనుషులు . సొంత వాళ్లు కూడా దారుణంగా వ్యవహవరిస్తూన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులను కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కలిసి దారుణంగా చితకబాదారు. కర్రలు చెప్పులతో దారుణంగా కొట్టడం మొదలు పెట్టాడు. వద్దు వద్దు అని ఎంత వేడుకున్నా కనీసం కరుణ చూపించలేదు. ఇక ఈ ఘటన గురించి తెలిస్తే అక్కడ ఉన్నది మనుషుల లేకపోతే మనిషి రూపంలో ఉన్న క్రూర మృగాల అనిపిస్తూ ఉంటుంది. ఇంతలా కొడుతున్నారు అంటే ఇక ఆ యువతులు పెద్ద తప్పు చేసి ఉంటారు అని అంటారా.
యువతులు చేసిన తప్పు కేవలం ఒక ఫోన్ కాల్ చేయడం మాత్రమే. ఇద్దరు గిరిజన యువతులు వారి మామ కొడుకు తో ఫోన్లో మాట్లాడినందుకు ఈ శిక్ష విధించారు కుటుంబ సభ్యులు. స్వయాన కుటుంబ సభ్యులు ఆ ఇద్దరు గిరిజన యువతులఫై అత్యంత పాశవికంగా దాడి చేసారు ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చాయి కాళ్లావేళ్లా పడి వేడుకున్న జాలి దయ చూపించలేదు. దారుణంగా కర్రలు చెప్పులతో కొడుకు హింసించారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు .