
కరోనా 'డెల్టా' కన్నా డేంజరస్ వేరియంట్.. పేరేంటో తెలుసా?
అయితే మొన్నటి వరకు భారత్లో వ్యాపించిన సెకండ్ వేవ్ కరోనా డెల్టా వైరస్ ఎంతో ప్రమాదకరం గా మారిపోయింది. ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతూ భారత్లో విపత్కర పరిస్థితులను తీసుకొచ్చింది దీంతో భారత్ మొత్తం ఇక సంక్షోభంలో కూరుకుపోతోంది అనుకుంటున్న తరుణంలో ఇక అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అటు కొత్త కరోనా వేరియంట్లు మళ్లీ భయపడుతున్నాయి. ఇక ఇటీవల కొత్తగా ' లంబ్డా 'అనే వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. భారత్తో విపత్కర పరిస్థితులను తీసుకొచ్చిన డెల్టా కంటే ఇది ఎంతో ప్రమాదకరమైనది అంటూ ఇటీవలే మలేషియా ప్రభుత్వం ప్రకటించింది.
పెరులో మే, జూన్ నెలలో నమోదైన 82శాతం కేసులు కూడా ఈ వైరస్ కు సంబంధించినవి అంటూ ఇటీవలే గుర్తించినట్లు మలేషియా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న వేగం డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగానే ఉన్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ఈ కొత్తరకం లంబ్డా వైరస్ 30 దేశాలకు పాకి పోయినట్లు తెలుస్తోంది అయితే ఈ కొత్తరకం వైరస్ ప్రమాదకర రీతిలో వ్యాప్తి చెందుతుందని దీనిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది. దీంతో ప్రజలందరిలో మళ్లీ భయం మొదలైంది.