సీఎంకు లోకేశ్ లేఖ..!
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులకు సంబంధించిన సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. అయితే కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో పరీక్షలు రాస్తున్న 17లక్షల మంది ఆరోగ్య భద్రత గురించి ఆలోచించాలని సూచించారు. ఇప్పటికే వివిధ యూనివర్సిటీలు, కళాశాలలు స్టూడెంట్స్ కు ఎగ్జామ్ క్యాలెండర్లు రిలీజ్ చేశాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి అవుతున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం థర్డ్ వేవ్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసుల నమోదయ్యాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ దెబ్బకు తెలుగు రాష్ట్రాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. వేలాది మంది ఆస్పత్రి పాలు కావడమే కాకుండా మరెందరో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటీ వందలాది కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు లోకేశ్. మూడో దశపై ప్రభుత్వం జాగ్రతగా ఉండాలని హెచ్చరించారు. పైగా రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు ఇంకా కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేదంటున్నారు లోకేశ్.
హయర్ ఎడ్యుకేషన్ పరీక్షల పాత్ర ఎంతో ఉందనీ.. అయితే లక్షలాది మందికి ఒకేసారి పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రమాదం పొంచుకు ఉందని హెచ్చరించారు లోకేశ్. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షల నిర్వహణ వద్దంటూ ఇప్పటికే తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయంతీసుకోవాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు లోకేశ్.