జగన్ గాంధీని అవమానిస్తున్నారా..? రఘురామ అనుమానం..?

Chakravarthi Kalyan
సీఎం జగన్ కు వినమ్రతతో నవ సూచనలు పేరుతో లేఖలు రాస్తున్న ఎంపీ రఘురామకృష్ణం రాజు  తన రెండో లేఖ సంధించారు. ఈసారి ఉపాధి హామీ పథకం కింద కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు జగన్ ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీ లేదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం కింద చేపట్టిన పనులకు మీరు ఇప్పటి వరకూ కూలి బకాయిలు కూడా చెల్లించలేదన్నారు.


రఘురామ తన లేఖలో ఇంకా ఏం రాశారంటే..” గ్రామీణ నిరుపేద కూలీలకు చెల్లించాల్సిన కూలి డబ్బు బకాయిలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పడం.. దానిపై రాష్ట్ర హైకోర్టు మండిపడ్డ విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద నిధులు లేవని చెప్పడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆక్షేపణ కూడా వ్యక్తం చేసింది. 2018-19 సంవత్సరానికి కేంద్రం నుంచి ఎంత మేరకు నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు చేశారు అనే ప్రశ్నలను కూడా రాష్ట్ర హైకోర్టు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై సంధించింది.”

 
"రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదని చెబుతూ... గ్రామీణ పేదలకు బిల్లులు చెల్లించక పోవడం జాతి పిత మహాత్మా గాంధీ ఆలోచనలకు పూర్తిగా భిన్నమైనది. విరుద్ధమైనది. 2018-19 ఆర్ధిక సంవత్సరం నుంచి 2020- 21 ఆర్ధిక సంవత్సరం మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకం కింద మొత్తం రూ.1,12,443.9 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు 2021 మార్చి 31 వరకూ ఉన్న సమాచారం. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 9.21% రూ.10,365.5 కోట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి పొందింది. 2018-19 సంవత్సరానికి కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు మాత్రం రూ.1500 కోట్ల కన్నా తక్కువే అన్నారు రఘురామ.

" గత రెండు సంవత్సరాలుగా వస్తున్న ఈ నిధులన్నీ ఏమైనాయని అడుగుతున్న ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. ఈ నిధులన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఎకౌంట్ లో వేసుకున్నట్లు కనిపిస్తున్నది. ఈ అంశంపై తదుపరి వాయిదాకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరింత కూలంకషంగా పరిశీలన చేయాలని సూచించారు. గాంధీ పేరుతో ఉన్న పథకాన్ని సరిగ్గా అమలు చేయకుండా ఆయన్ను అవమానిస్తున్నారని లేఖలో రాశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: