గుడ్ న్యూస్ : కరోనాను పసిగట్టే మాస్క్ వచ్చేసింది?
ఇక మరికొంత మంది ఇళ్లల్లో కూడా మాస్క్ ధరిస్తూ ఉన్నారు. ఇలా మాస్కు పెట్టుకోవడం,భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో రోజువారి పని గా మారిపోయింది. ఇలాంటి సమయంలోనే ఎంతోమందిని ఆకర్షించేందుకు మార్కెట్లోకి ఎన్నో వినూత్న మైన మాస్క్ లు కూడా వస్తున్నాయి. కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా అడ్డుకునేందుకు ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన మాస్క్ లను తయారుచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇలా సాదాసీదా మాస్క్ మాత్రమే కాకుండా వేగంగా కరోనా వైరస్ గుర్తించే సెన్సారు లతో కూడిన మాస్క్ లు సైతం ఇటీవల కాలంలో మార్కెట్లోకి వస్తున్నాయి.
ఇక తాజాగా మరో సరికొత్త మాస్క్ మార్కెట్లోకి వచ్చేసింది. ఇక ఈ మాస్క్ పెట్టుకున్నాము అంటే మనకు కరోనా వైరస్ వచ్చిందో లేదో అన్న విషయాన్ని ఎంతో సులభంగా గుర్తించగలుగుతారు. కరోనా వైరస్ ను గుర్తించే ఈ మాస్క్ ను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఈ మాస్క్ వేసుకున్న వ్యక్తి 15 నుంచి 30 నిమిషాల పాటు ఊపిరి పీల్చుకున్న తర్వాత.. సెన్సార్ బటన్ నొక్కాలి. ఈ క్రమంలోనే మాస్కు స్వల్ప మొత్తంలో నీటిని విడుదల చేస్తోంది. ఇక ఈ నీటిని రిడౌట్ స్ట్రిప్ ఫై వేస్తే 90 నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితం వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.