జ‌గ‌న్ ఈ కీల‌క ప‌ద‌వి క్ష‌త్రియుల‌కే ఇస్తున్నాడా... ర‌ఘుకు చెక్ ?

VUYYURU SUBHASH
ప్ర‌స్తుతం ఏపీలో ర‌ఘురామ కృష్ణంరాజు వ్య‌వ‌హారం జ‌గ‌న్‌కు ... వైసీపీకి ఎంత మైన‌స్ గా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ర‌ఘురామ‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం అరెస్టు చేయ‌డంతో పాటు అనేక విధాలా టార్గెట్ చేయ‌డంతో క్ష‌త్రియుల్లో కొంత వ్య‌తిరేక‌త రావ‌డంతో పాటు జ‌గ‌న్ మ‌న‌ల‌ను టార్గెట్ చేస్తున్నారా ? అన్న సందేహాల‌కు కార‌ణ‌మైంది. ఇక ఎప్పుడు అయితే జ‌గ‌న్ కేబినెట్లో మంత్రులు, వైసీపీ ప్ర‌భుత్వం అదే క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన అశోక్ గ‌జ‌ప‌తిరాజును టార్గెట్ చేసి.. ఆయ‌న్ను మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి దించేసిందో అప్ప‌టి నుంచి క్ష‌త్రియులు జ‌గ‌న్ తీరుపై గుర్రుగా ఉన్నారు.

అయితే ఈ వ‌ర్గంలో పార్టీపై.. త‌న‌పై ఉన్న అస‌మ్మ‌తికి చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ కొత్త ప్లాన్ అమ‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని క్ష‌త్రియ వ‌ర్గానికి క‌ట్ట బెట్టే ఆలోచ‌న జ‌గ‌న్ చేస్తున్నార‌ట‌. అందుకే జ‌గ‌న్ బాబాయ్ వైవి. సుబ్బారెడ్డి ప‌ద‌వి రెండు సంవ‌త్స‌రాలు పూర్తి కాగానే ఆయ‌న్ను మ‌రోసారి రెన్యువ‌ల్ చేయ‌లేద‌ని అంటున్నారు. టీటీడీ పాలకమండలి నియామకంలో కొంత కసరత్తు చేయడానికే జ‌గ‌న్ టైం తీసుకుంటున్నార‌ట‌. అందుకే అప్ప‌టి వ‌ర‌కు స్పెసిఫైడ్ అథారిటీని నియమించారని పార్టీ వర్గాలే చెపుతున్నాయి.

క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి ఈ ప‌ద‌వి ఇస్తే ఆ వ‌ర్గంలో పార్టీ పై ఉన్న వ్య‌తిరేక‌త చాలా వ‌ర‌కు పోతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. గ‌తంలో కూడా కాంగ్రెస్ పాల‌న‌లో ఇదే వ‌ర్గం నుంచి అప్ప‌టి న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరి బాపిరాజు చైర్మ‌న్ గా నాలుగేళ్ల పాటు ఉన్నారు. ఇక టీడీపీ పాల‌న‌లో బ‌లిజ వ‌ర్గానికి చెందిన చ‌ద‌ల‌వాడ‌, ఆ త‌ర్వాత బీసీ వ‌ర్గానికి చెందిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ చైర్మ‌న్లుగా ఉన్నారు. ఇక ఇప్పుడు జ‌గ‌న్ త‌న‌పై క్ష‌త్రియ వ్య‌తిరేక ముద్ర‌ను ఇలా తొల‌గించే ప్లాన్ లో ఉన్నార‌ట‌. పాలకమండలిలో సభ్యుల నియామకంపై జాతీయ స్థాయిలో కూడా కొంద‌రు ప్ర‌ముఖులు జ‌గ‌న్ పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: