రేవంత్‌కు పదవి.. టీ కాంగ్రెస్‌లో ముసలం.. సీనియర్ల రాజీనామాలు
ఇక కొందరు నేతలు రేవంత్ రెడ్డి కు పదవి రావడంపై ఆగ్రహంతో ఉంటే మరి కొందరు అకలబూని రాజీనామాలు ప్రారంభించారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఇక ఆయన బాటలోనే మరికొందరు నేతలు రాజీనామా చేసే అవకాశముంది. లక్ష్మారెడ్డి గతంలో టీడీపీలో ఉండే వారు.. ఆ తర్వాత ఆయన వైఎస్ దయతో మేడ్చల్ సీటు దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు.
2009 ఎన్నికలకు ముందు వరకు ఆయన టీడీపీలో ఉండేవారు. చంద్రబాబు ఆ ఎన్నికల్లో లక్ష్మారెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు కూడా ఇచ్చారు. అయితే ఆయన చివర్లో వైఎస్ పార్టీలోకి ఆహ్వానించి మేడ్చల్ సీటు ఇవ్వడంతో ఆ పార్టీలోకి జంప్ చేసేశారు. తర్వాత కాంగ్రెస్ నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసినా గెలవలేదు. పార్టీలో అవుట్ డేటెడ్ లీడర్లలో ఒకరు అయిపోయారు. ఇప్పుడు రేవంత్‌కు పదవి ఇవ్వడంతో అలిగి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. ఏదేమైనా ఇలాంటి రాజీనామాలు టీ కాంగ్రెస్ లో మనం మరి కొన్ని చూస్తాం.