జగన్ వీళ్లను నమ్మి నిండా మునుగుతున్నాడే ?
విచిత్రం ఏంటంటే ఈ 22 మంది ఎంపీల్లో చాలా మంది కొత్తవారే. మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వంగా గీత ( ఆమె కూడా రాజ్యసభకు ఎంపికయ్యారు), అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్లు మినహా ఎవ్వరూ కూడా పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వారు కాదు. అందరూ కొత్త మొఖాలే. ఇక వీరంతా కూడా ప్రజల వద్దకు వెళ్లడం లేదు.. ప్రజలకు తమ మొఖాలు చూపించడం కూడా లేదు.
ఒంగోలు, నరసరావుపేట, రాజంపేట, అనంతపురం, హిందూపురం, బాపట్ల, మచిలీపట్నం, ఏలూరు, అమలాపురం, విశాఖ, నెల్లూరు ఎంపీలకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రమైన విబేధాలు ఉన్నాయి. 15 మంది ఎంపీలకు ఎమ్మెల్యేలు, మంత్రులతో పొసగని పరిస్థితి ఉంది. వీరంతా వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీ ఓటు విషయంలో సహకరించమని ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేస్తున్నారు.
సరే ఈ గొడవల సంగతి ఎలా ఉన్నా ఎంపీలు ప్రజల్లోకి వెళ్లి.. తమ వంతుగా సాయం చేస్తున్నా.. ప్రజల కు తమ మొఖాలు చూపిస్తున్నా వాళ్లకు క్రేజ్ ఉంటుంది. అసలు తాము ఎంపీలం అన్న విషయమే చాలా మందికి గుర్తున్నట్టు లేదు. లావు శ్రీకృష్ణ దేవరాయులు లాంటి ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లకు తమ పదవే గుర్తున్నట్టు లేదు.