గుడ్ న్యూస్.. సీజ్ అయిన వాహనాలను తీసుకెళ్లొచ్చు?

praveen
తెలంగాణ రాష్ట్రం లో కరోనా సెకండ్ వేవ్ శరవేగం గా పాకి పోయిన సమయం లో  ప్రభుత్వం అప్రమత్తమైంది. మొదట నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ఇక చివరికి లాక్ డౌన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం.  కేవలం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చి మిగతా సమయం మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ విధించింది.  లాక్ డౌన్ సమయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే భారిగా జరిమానా కూడా విధించింది ప్రభుత్వం.  ఒకవేళ లాక్డౌన్ సమయంలో వాహనదారులు రోడ్డు పైకి వస్తే ఏకంగా వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.



 అంతేకాదు వాహనాన్ని సీజ్ చేసి ఇక పోలీస్ స్టేషన్లకు తరలించారు.  ఇలా లాక్ డౌన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంతోమంది వాహనదారులకు షాక్ ఇచ్చారు పోలీసులు. భారీగా జరిమానాలు విధించడంలో అటు వాహనదారులు ఆందోళనలో మునిగిపోయారు.  సీజ్ అయిన తమ వాహనాలను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు.  ఇటీవలే సీజ్ అయినా వాహనాల విషయంలో వాహనదారులకు శుభ వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.  లాక్ డౌన్ లోడ్ సీజ్ అయిన వాహనాల  విడుదలకు రంగం సిద్ధం చేసింది.



 జరిమానాలు చెల్లించిన వారి వాహనాలను విడుదల చేయాలి అంటూ ఇటీవల ఎస్పి, పోలీస్ కమిషనరేట్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ -పెట్టి,ఈ చలానా ద్వారా జరిమానాలు చెల్లించి ఇక పోలీస్ స్టేషన్కు వెళ్లి  తమ వాహనాలను తీసుకోవచ్చు అంటూ తెలిపింది. ఒకవేళ తీవ్రమైన కేసులు ఉంటే పోలీసులు ఇక వాహననానికి సంబంధించిన కేసును కోర్టు కు పంపితే వాహనదారుడుకి కోర్టులోనే జరిమానా విధించడం లేదా ప్రోసిడింగ్  ప్రకారం శిక్ష ఖరారు చేయడం జరుగుతుందని డిజిపి కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: