రాజకీయాలకు గుడ్ బై చెప్పిన టీడీపీ ఫ్యామిలీ ?
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు చిన్న తరహా నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్న మాగంటి బాబును ఓ జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ఓడినందుకు రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేయించారు. వైఎస్ మంత్రి పదవికి రాజీనామా చేయించడంతో తీవ్ర అవమానంగా భావించిన మాగంటి 2009 ఎన్నికల వేళ టీడీపీలోకి జంప్ చేసి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మాగంటి టీడీపీ ఎంపీగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ హోదాలో ఘోరంగా ఓడిన ఆయన ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
మాగంటి రాజకీయ వారసుడిగా ఉన్న మాగంటి రాంజీ కొద్ది రోజుల క్రిందటే ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఆయన రెండో కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి సైతం ఇటీవలే మృతి చెందారు. ఇద్దరు కుమారులను రెండు నెలల తేడాలో కోల్పోయిన ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇక వయస్సు పై బడడంతో ఆయన ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో ఉండలేనని కూడా చెప్పేస్తున్నారు. దీంతో శతాబ్దాల చరిత్ర ఉన్న మాగంటి బాబు ఫ్యామిలీ రాజకీయం ఇక ముగిసిందనే చెప్పాలి.