వరంగల్ ను చూసి హైదరాబాదోళ్లు కుళ్లుకోవాలె : కేసీఆర్

frame వరంగల్ ను చూసి హైదరాబాదోళ్లు కుళ్లుకోవాలె : కేసీఆర్

నేడు మ‌ఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రంగ‌ల్, యాదాద్రి జిల్లాల్లో ప‌ర్య‌టించారు. వ‌రంగ‌ల్ లో కేసీఆర్ అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశారు. వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన కలెక్టర్ భవనం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. పరిపాలన విభాగం లో పనులు తొందరగా జరగాలని అడ్మినిస్ట్రేషన్ బాగుండాలని తెలిపారు. వరంగల్ ,హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేస్తూ రెండు మూడు రోజుల్లో అనుమతులు ఇస్తామ‌న్నారు. జిల్లా లో వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు కోసం కృషిచేస్తున్న‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో రెండోవ రాజదాని గా వరంగల్ ను అభివృద్ధి చేస్తామ‌న్నారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయం కోసం 2 ఎకరాల్లో భవన నిర్మాణం చేయాలని చెప్పారు. ధరణి ద్వారా తొందరగా రైతు సమస్యలు తీరుతున్నాయ‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కేసులు పరిష్కారం అవుతున్నాయన్నారు. వరంగల్ నగరం వైద్య, విద్య, విజ్ఞాన రంగంలో ముందుండాలన్నారు. కెనెడా  మాదిరిగా వరంగల్లో వైద్య స‌దుపాయ‌ల‌ను తీర్చిదిద్దాలన్నారు. మాత ,శిశు సంక్షేమశాఖ ద్వారా ప్రసవ స‌మయంలో మృతుల శాతం చాలా వరకు తగ్గించామని, అలాగే ప్రతి తాలూకా సెంటర్ లో మాత శిశు సంక్షేమ పథకం ద్వారా వైద్యం అందించాలన్నారు. ఎంజీఎం , ఐ హాస్పిటల్, సెంట్రల్ జైలు, మొత్తం స్థలాన్ని, వైద్య విభాగంలో ఉన్న అన్ని రకాల సేవలు హబ్ లు గా అందుబాటు లో ఉండాలన్నారు. వ‌రంగ‌ల్ లో డెంటల్ హాస్పటల్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. అంతే కాకుండా డెంట‌ల్ హాస్పిట‌ల్ ను సాంక్ష‌న్ చేశారు.

హైద‌రాబ్ లో పళ్ల స‌మ‌స్య ఉన్నవాళ్లు వ‌రంగ‌ల్ కు రావాల‌ని అన్నారు. హైద‌రాబాదోళ్లు వ‌రంగ‌ల్ ను చూసి కుళ్లు కోవాల‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మమునుర్ లో విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. వరంగల్ లో మంచి నీటి సమస్య లేదని....హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేలా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జ‌లంద‌రికీ వ‌రంగ‌ల్ లో వైద్యసేవలు అందించాలని తెలిపారు. వరంగల్ లో 200 ఎకరాల్లో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. చైనా లో 28 గంటల్లో 10 అంతస్థుల బిల్డింగ్ కట్టారు....మీరు ఎన్ని రోజుల్లో కడతారు అని అధికారుల‌ను ప్రశ్నించారు. 18 నెలల్లో ఆసుపత్రి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: