కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహం.. బిజెపి తీవ్ర ఆగ్రహం?

praveen
సాధారణంగా పలు ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు కొంతమందికి వీరులను చిరస్మరణీయంగా తలుచుకోవడానికి ఇక పలు కూడళ్లలో విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే  ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.  ఇక ఇది కాస్త ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఐతే టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయడంపై అటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  ముఖ్యంగా బిజెపి అధికార పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతోంది.

  ఇలా టిప్పుసుల్తన్ విగ్రహంపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కాస్త సంచలనంగా మారిపోయాయి. భారతీయులనూ కాఫీర్లు గా ముద్ర వేసి ఎంతో మందిని ఊచకోత కోసిన దుర్మార్గుడైన టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని మత సామరస్యానికి మారుపేరైన పొద్దుటూరు లో ఏర్పాటు చేయడం ఏమాత్రం మంచిది కాదు అంటూ అటు బిజెపి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు కర్నాటి ఎల్లారెడ్డి తన వ్యతిరేకతను ప్రకటించారు.

 ఎవరిదైనా విగ్రహం ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు అతని జీవిత చరిత్రను పూర్తిగా చదివితే బాగుంటుందని హితవు పలికాడు. ఇక ఇలా పూర్తిగా జీవిత చరిత్ర తెలుసుకున్న తర్వాతే అప్పుడు విగ్రహం పెట్టాలా వద్దా అని ఆలోచించాలని సూచించారు. టిప్పు సుల్తాన్ ను ఎంతో క్రూరుడు కాబట్టి... భారతీయుల పట్ల అమానుషంగా వ్యవహరించాడు కాబట్టే గతంలో ఎక్కడా కూడా అతని విగ్రహం పెట్టలేదని  తెలిపాడు. రాజ్యకాంక్షతో మత విద్వేషంతో భారతీయులను మహిళలను క్రూరంగా హింసించి చంపాడు టిప్పుసుల్తాన్. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ప్రశాంతతకు నిలయము అయినా   పొద్దుటూరులో ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు.  దేశానికి ఎన్నో సేవలు చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కంటే టిప్పుసుల్తాన్   గొప్ప వాడు కాదు అంటూ ఈ సందర్భంగా హితవు పలికారూ ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: