ఎల్ఐసి అదిరిపోయే పాలసీ.. రూ.లు 150 ఆదాతో 19 లక్షలు?

praveen
ప్రస్తుతం దేశీయంగా భీమారంగంలో ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకొని ఎన్నో ఏళ్ల నుంచి దిగ్గజ బీమా రంగ సంస్థగా కొనసాగుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. భీమా రంగంలో ఎన్నో కొత్త సంస్థలు వచ్చినా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూ పోతూ ఉంటుంది.  ప్రస్తుతం తమ కస్టమర్లను అవసరాలకు అనుగుణంగా ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు మెరుగ్గా తీర్చిదిద్దేందుకు..  అంతే కాదు ఇంకా ఎంతో మందికి వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచేందుకు..  కొంతమందికి భారీగా ఆదాయం సంపాదించేందుకు ఇలా ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.



 ఇక తమ పాలసీల ద్వారా అందరికీ ఆర్థిక భద్రత కల్పిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇక ప్రస్తుతం పిల్లల కోసం ఎల్ఐసి  న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ అందిస్తోంది. ఇందులో 12 ఏళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు చేరేందుకు అవకాశం ఉంటుంది  గరిష్ఠంగా 10 వేల బీమా మొత్తానికి పాలసీ పొందవచ్చు. ఇక ఈ పాలసీలో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు ఇక ఈ పాలసీ యొక్క టర్మ్ ప్లాన్ 25 ఏళ్ళు ఉంటుంది. 25 ఏళ్ల వరకు ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమ చేస్తూ వెళ్లాలి.  ఇక ఆ తర్వాత ఇక మధ్యలో పిల్లల చదువుల కోసం కొంత మొత్తాన్ని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.



 పిల్లలకు 18 ఏళ్ళు వచ్చిన సమయంలో పాలసీలో 20% డబ్బులు తీసు కోవచ్చు.. ఇక 20 ఏళ్ళు వయస్సు వచ్చిన సమయంలో 20%.. 22 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మరో 20 శాతం డబ్బులు తల్లిదండ్రులకు అందిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇక మిగతా 40 శాతం డబ్బులను పాలసీ గడువు ముగిసిన తర్వాత అందిస్తారు. ఒకవేళ మీరు ఐదేళ్ల వయసులో పిల్లల పేర్లు పై పాలసీ తీసుకుంటే నెలకు 4,300 రూపాయలు ప్రీమియం చెల్లించాలి అంటే రోజుకి 150 రూపాయలు పొదుపు చేస్తే సరిపోతుంది. ఇక మెచ్యూరిటీ సమయం పూర్తయిన తర్వాత 19 లక్షలు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: