ఓ వైపు ఆనందం.. మరో వైపు ఆందోళన.. తడిసి ముద్దవుతున్న భారత్?
ఈ క్రమంలోనే తొలి చినుకు పలుకరించడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అనుకున్నదాని కంటే ముందు ఇక వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఇక వ్యవసాయ భూమిలో చెమట చిందించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అటు నగర వాసులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే నగరాల్లో కాస్త చినుకు పడింది అంటే పూర్తిగా చిత్తడిగా మారిపోతుంది. ఎక్కడికక్కడ రహదారులపై నీళ్లు నిండిపోతాయ్.. జనావాసాల్లోకి నీళ్లు రావడం లాంటివి జరుగుతుంది.
దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు ఇదే రీతిలో కొనసాగితే మరి కొన్ని రోజుల్లో ఇక వాగులు వంకలు చెరువులు పొంగి పొరలే అవకాశముంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై మొత్తం ఇప్పడికే వర్షాలతో నీట మునిగిపోయింది. నిన్న రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు మొత్తం నీట మునిగిపోయాయి. రైల్వే ట్రాక్ లు సైతం నీటమునిగాయి.
మరో 5 రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పుటికే కురిసిన వర్షానికి దారుణంగా పరిస్థితి ఉంటే ఇక మరో ఐదు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు ఉంటాయి అని చెప్పడంతో ఇక నగర వాసులు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఈనెల 11న ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఇక రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలా మాన్ సూన్ రావడంతో భారత్ మొత్తం తడిసి ముద్దవుతుంది.