మలయాళ నర్సుల నోటీసుపై వెనక్కు తగ్గిన జిప్ మర్ హాస్పిటల్

VAMSI
ఢిల్లీ  ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జి బి పంట్ హాస్పిటల్  ( ఢిల్లీ బల్లభ్ పంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) హాస్పిటల్ లో భాష గురించి చెలరేగిన  వివాదం తెలిసిందే. అయితే ఆ విషయంలో  కాస్త వెనక్కి తగ్గింది యాజమాన్యం. జిప్ మర్ ఆస్పత్రిలో పని చేస్తున్నటువంటి కేరళ నర్సులు, అక్కడ చికిత్స తీసుకుంటున్న మలయాళం తెలిసిన రోగులతో ఆ భాష మాట్లాడుతుండగా, ఇక్కడ మలయాళ భాష మాట్లాడడం వలన రోగులు ఇబ్బంది పడుతున్న కారణంగా, పేషెంట్లు మరియు ఇతర హాస్పిటల్ సిబ్బందితో ఇంగ్లీష్ లేదా హిందీ లోనే మాట్లాడాలని కేరళ నర్సులకు  ఉత్తర్వులు జారీ చేశారు  అధికారులు. అయితే హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చిన ఈ నోటీసుపై కేరళ నర్సులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మలయాళం తెలిసిన వారితో, అదే భాష మాట్లాడితే తప్పు ఏమిటి అంటూ ప్రశ్నించారు.

అంతే కాదు ఈ విషయంలో న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నారు మలయాళీలు. వీరు చెబుతున్న ప్రకారం అక్కడ పనిచేస్తున్న 850 మంది నర్స్ లలో 400 మంది మలయాళం భాష మాట్లాడే వారే ఉండడం గమనార్హం. మలయాళ భాషను అవమానించే విధంగా ఈ నోటీసులు ఉన్నాయంటూ, ఇది మమ్మల్ని మా భాషను తక్కువ చేసి చూసినట్లే అంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఇది చిలికి చిలికి గాలి వానలా మారుతుండడంతో, ఆలోచించిన జిప్ మర్ ఆసుపత్రి యాజమాన్యం కాస్త వెనక్కు తగ్గింది. వారికి ఇచ్చిన నోటీసులను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఉన్న కోవిడ్ అత్యవసర సమయంలో ఇటువంటి వివాదాలకు తావిచ్చి మరిన్ని సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఢిల్లీ జిప్మార్ హాస్పిటల్ లో వివాదం సర్దుమణిగినట్లు కనిపిస్తోంది. అయితే కొద్ది కాలం క్రితం కన్నడ భాషకు కూడా ఇదే పరిస్థితి ఎదురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జిప్ మర్ హాస్పిటల్ లో వైద్య సేవలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా యధావిధిగా కొనసాగుతున్నాయి. దీని గురించి తెలిసిన వారు ఎవరి భాష వారికి గొప్ప అని, ఏ భాషను అయినా సరే తక్కువ చేసి మాట్లాడడం తప్పు అవుతుందని హాస్పిటల్ యాజమాన్య తీరును తప్పుబడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: