కోడలిని అమ్మేసిన మామ.. కొడుకేం చేసాడో తెలుసా?

praveen
ప్రస్తుతం దేశం మొత్తం అభివృద్ధి పథంలో దూసుకు పోతుంది. అధునాతన నాగరికత వైపు అడుగులు వేస్తుంది. అయితే అటు టెక్నాలజీ కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే టెక్నాలజీ పెరిగిపోవడం ఏమో కానీ మనిషి తీరు రానురాను ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంటోంది నేటి రోజుల్లో.ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా బంధాలు బంధుత్వాలకు విలువ ఇవ్వడం లేదు నేటి రోజుల్లో జనాలు.  సాటి మనుషుల పట్ల ఎక్కడ మానవత్వాన్ని చూపించడం లేదు.



 ఇక సొంత వాళ్ల విషయంలోనే దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఒక ఘటన వెలుగులోకి వచ్చింది . పుట్టింటి నుంచి మెట్టినింట్లో అడుగుపెట్టిన కోడలిని సొంత కూతురిలాచూసుకోవాలి మామ. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ తండ్రిలా ఆదరించాలి. ఎప్పుడైనా కొడుకు కోప్పడిన సర్ది చెబుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఒక మామ మాత్రం నీచానికి ఒడిగట్టాడు. కూతురిలా చూసుకోవాల్సి న కోడలని ఏకంగా అంగట్లో అమ్మకానికి పెట్టేసాడు.  కొడుకు కు తెలియకుండా కోడలని అమ్మేశాడు.



 సభ్య సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణ ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విషయాన్ని బ్రోకర్ల సహాయంతో తెలుసుకున్నాడు చందా రామ్ అనే వ్యక్తి. ఈ క్రమంలోనే అతనికి డబ్బు ఆశ కలిగింది. ఇక ఇంట్లో ఉన్న కోడలని అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా 80 వేల రూపాయలకు తన కోడలిని అమ్మేశాడు. ఇక ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న చంద్రా రామ్ కొడుకు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు బాధితురాలి ఆచూకీ కోసం జల్లెడ పట్టారు. ఆ ప్రాంతంలో ఒక రైల్వేస్టేషన్లో బాధితురాలితో అహ్మదాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నిందితులను పట్టుకొని కటకటాల వెనుకకు తోసారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: