జూన్ 9 నుంచి.. ఏపీ వాసులకు ఇబ్బందులు తప్పవేమో.. ఎందుకంటే?

frame జూన్ 9 నుంచి.. ఏపీ వాసులకు ఇబ్బందులు తప్పవేమో.. ఎందుకంటే?

praveen
ప్రస్తుతం కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను పణం గా పెట్టి మరి పోరాడుతున్న వైద్యులు ఇక ఇప్పుడు ఇదే సమయాన్ని తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రం లో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. తమకు ఇన్సెంటివ్స్ పెంచడంతోపాటు తమ డిమాండ్లు అన్ని నెరవేర్చాలని లేదంటే వీధుల్లోకి హాజరయ్యే ప్రసక్తే లేదు అంటూ విధులు బహిష్కరించి మరి సమ్మె నిర్వహించారు. ఇక కరోనా క్లిష్ట పరిస్థితుల్లో జూనియర్ డాక్టర్ల సమ్మె నిర్వహించడం తో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.



 అయితే జూనియర్ డాక్టర్ల డిమాండడ్స్ నెరవేర్చడం విషయం లో కొన్ని రోజులపాటు మొండి పట్టు తోనే ఉన్న ప్రభుత్వం చివరికి దిగివచ్చి వారి డిమాండ్లను నెరవేర్చింది. తెలంగాణ జూనియర్ డాక్టర్లు వారి డిమాండ్లను సాధించుకున్నారు  ఇక ఇప్పుడు మేమేం తక్కువ అనుకున్నారో ఏమో ఏపీ జూనియర్ డాక్టర్లు కూడా సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమయ్యారు.  అయితే కేవలం జూనియర్ డాక్టర్లు మాత్రమే కాదు సీనియర్ రెసిడెంట్ లు సైతం సమ్మెకు దిగుతున్నట్లు పిలుపునివ్వడం సంచలనం గా మారి పోయింది.



 అంతే కాదండోయ్ ఏకంగా కరోనా వైరస్ చికిత్స ను సైతం బహిష్కరించ పోతున్నట్లు ఇటీవల జూనియర్ డాక్టర్లు సీనియర్ రెసిడెంట్ లు ప్రకటించారు.ఆరోగ్య బీమా, ఎక్స్గ్రేషియా సహా మరి కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు జూనియర్ డాక్టర్లు. కోవిడ్ ప్రోత్సాహకాలతో పాటు.. ఆస్పత్రిలో భద్రతా ఏర్పాట్లను కూడా పెంచాలని అంతేకాకుండా టిడిఎస్ కోత విధించ వద్దు అంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే సమ్మెకు దిగుతాం అంటూ హెచ్చరించారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాక.. జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు అంటే మాత్రం ఏపీ వాసులకు ఇక ప్రస్తుత క్లిష్ట సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: