పెళ్లి పీటలు పైన ప్రియుడితో చాటింగ్ చేసిన వధువు.. చివరికి?

praveen
సాధారణంగా వధువు గాని.. వరుడు గాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ముందుగా పెద్దలకు చెబుతారు. పెద్దలు మొండి పట్టు పడితే పెళ్లి పీటల వరకు వచ్చి సరిగ్గా తాళికట్టే సమయానికి నాకు పెళ్లి ఇష్టం లేదు అంటూ అందరికీ షాక్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు జరగడం చూసాం.. కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం కాస్త డిఫరెంట్.  అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. అయినా కూడా పెళ్లి పిట్టల వరకు వచ్చేసింది పెళ్ళి తంతు.  అయితే పెళ్లి పీటలపై కూర్చున్న వధువు  అక్కడినుంచి ప్రియుడితో మెసేజ్ చేయడం మొదలుపెట్టింది. ఇక పక్కనే ఉన్న వరుడు ఇది చూసి ఏదో తేడా కొడుతుంది అనుకున్నాడు.



 ఈ క్రమంలోనే వరుడు తరపు బంధువులకు కూడా కొంతమందికి అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.  ఆ యువతి మూడేళ్లుగా ఓ యువకుని ప్రేమిస్తుందని ఇక ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పటికీ  ఆ యువకుడితో జంప్ కావాలని యువతి ప్లాన్ చేసింది అనే విషయం బయటపడింది. దీంతో వరుడు తరపు బంధువులు అందరూ అవాక్కయ్యారు. ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ యువతికి మహబూబ్ నగర్ కు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది.



 అయితే వధువు తనకు పెళ్లి ఇష్టం లేదు అన్న విషయాన్ని తల్లిదండ్రులకు ధైర్యం చేసి చెప్పలేకపోయింది. ఈ క్రమంలోనే పెళ్ళి తంతు ఏకంగా పెళ్లి పీటల వరకు వచ్చింది. ఆ తర్వాత పెళ్లి పీటల పై కూర్చున్న వధువు తరచూ సెల్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ ఉండడాన్ని గమనించారు. కొంతమంది వధువు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత అదే పెళ్లి వేడుకలు అనుమానాస్పదంగా కనిపించిన యువకుని పక్కకు తీసుకెళ్లి దేహశుద్ధి చేసి నిలదీయడంతో అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పెళ్లి చేసుకునే యువతీ తనతో మూడేళ్లపాటు ప్రేమ లో ఉందని చెప్పి.. వారు కలిసి దిగిన ఫోటోలను కూడా చూపించాడు. పెళ్లి జరిగినప్పటికీ రాత్రికి రాత్రి జంప్ కావాలని నిర్ణయించుకున్నాము అంటూ చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు అంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇరు కుటుంబాల అంగీకారంతో అందరిని ఇంటికి పంపించేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: