గుడ్ న్యూస్.. టీకా తీసుకున్నాక ఎవరు చనిపోలేదట?

praveen
దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. గత ఏడాదితో పోల్చి చూస్తే రెండవ దశ కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది పై పంజా విసురుతోంది. దేశం లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ వైరస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అదే సమయం లో వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగి పోతుంది. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలలో కఠినమైన ఆంక్షలు అమలు లోకి తెచ్చాయి.

 ఈ క్రమం లోనే ప్రస్తుతం దేశంలో  వైరస్ కేసులు సంఖ్య కాస్త తగ్గు ముఖం పట్టింది. కానీ అటు మరణాల సంఖ్య మాత్రం ఇప్పటికే అదుపులోకి రావడం లేదు. రోజు రోజుకు మరణాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతు ప్రజలందరినీ బెంబేలెత్తిస్తోంది.  ఈ క్రమం లోనే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మరణాలు సంభవిస్తున్నాయేమో అని ఎంతోమంది ఆందోళనలో మునిగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఎంతోమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా వెనకాడుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ఎయిమ్స్ వైద్యులు.

 కరోనా వాక్సిన్ తీసుకున్న తర్వాత వారికి పాజిటివ్ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదు అంటూ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఢిల్లీకి చెందిన 63 మందిపై ఏప్రిల్,మే నెలల్లో అధ్యయనం చేసిన తర్వాత ఈ నివేదిక వెల్లడించినట్లు తెలిపారు వైద్య నిపుణులు.  వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వైరస్ సోకితే దానిని బ్రేక్ త్రు ఇన్ఫెక్షన్ అని అంటారని.. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు వరకు ఎవరు చనిపోలేదు అంటూ చెప్పుకొచ్చారు . వ్యాక్సిన్ తీసుకున్నవారు తీవ్రమైన జ్వరంతో బాధ పడ్డారు కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు అంటూ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: