ఎంత దారుణం.. కూతురే తల్లిని చంపేసింది?
ఇక ఇటీవల ఇలాంటి తరహా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తల్లి తనకు కూతురు పుట్టింది అని ఎంతో ఆనంద పడిపోయింది. కానీ పెద్దయ్యాక ఆ కూతురు తన ప్రాణాలు తీస్తుంది అని మాత్రం ఊహించలేకపోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురే పెద్దయ్యాక చివరికి తన పాలిట కాల యముడు గా మారిపోయింది. పెన్షన్ డబ్బులు కోసం తల్లిని దారుణంగా హత్య చేసి చంపింది ఇక్కడ ఒక కూతురు. ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. అక్కన్న పేట గ్రామానికి చెందిన అప్సనా అనే మహిళ పదేళ్ల కిందట భర్త మృతి చెందగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
భర్త లేకపోయినప్పటికీ కూతురికి ఎలాంటి లోటు రాకుండా అన్ని బాధ్యతలు తానే తీసుకొని అల్లారుముద్దుగా పెంచింది. తర్వాత కూతురు ఇటీవలే ఒక వ్యక్తిని ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇటీవలే అఫ్సానా అనారోగ్యానికి గురైంది. దీంతో తనకు సహాయం చేసేందుకు ఎవరూ లేకపోవడంతో తన కూతురుని పిలిపించుకుంది. అయితే తల్లికి సహాయం చేయడానికి వచ్చిన కూతురు మాత్రం దారుణంగా వ్యవహరించింది. తల్లి పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వలేదు అనుకో నెపంతో దారుణంగా తల్లిని హత్య చేసింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.