రఘురామ కేసులో పోలీసుల సరికొత్త వాదన?
రఘురామకృష్ణంరాజుకూ పోలీసుల కస్టడీలోనే గాయాలు అయ్యాయి అంటూ చెబుతున్నారని.. కానీ ఆయనకు గాయాలు ఉన్నాయని సికింద్రాబాద్ సైనిక్ ఆస్పత్రి నివేదికలో ఎక్కడా చెప్పలేదు అంటూ సిఐడి పోలీస్ అధికారులు అంటున్నారు. సుప్రీం కోర్టుకు అటు సైనిక ఆస్పత్రికి సమర్పించిన నివేదికలో ఇదే విషయం వెల్లడించింది అంటూ చెప్పుకొచ్చారు సిఐడి అధికారులు. ఏకంగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చే ముందే మూడుసార్లు వైద్యులు పరిశీలించి, పరీక్షించిన తర్వాతే నివేదిక ఇచ్చారని ఈ నివేదికలో రఘురామకృష్ణంరాజు గాయాలు అయినట్లుగా ఎక్కడా లేదు అంటూ తెలిపారు.
అదే సమయంలో రఘురామ కృష్ణంరాజును గుంటూరు సిఐడి కోర్టులో హాజరు పరిచే ముందు జారీచేసిన ఫిట్నెస్ రిపోర్టును గుంటూరు జిజిహెచ్ వైద్యుల బృందం హైకోర్టుకు సమర్పించింది. అయితే గుంటూరు జిజిహెచ్ వైద్యుల బృందం ఇచ్చిన నివేదికలో కూడా రఘురామకృష్ణంరాజుకూ ఎక్కడ గాయాలు లేవు అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది అన్న విషయాన్ని సిఐడి అధికారులు తెలిపారు రఘురామకృష్ణంరాజు ఏడీమా ఉందని.. అంతేకానీ పోలీసుల కస్టడీలో ఎక్కడ గాయాలు అయినట్లు పేర్కొనలేదు అంటూ చెప్పుకొచ్చారు అధికారులు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కాళ్లకు గాయాలు అయ్యాయి అనే విషయాన్ని సైనిక ఆస్పత్రి చెప్పింది అంటూ తప్పుడు ప్రచారాన్ని మీడియాలో ప్రచారం చేయడం ఏమాత్రం సరికాదు అభిప్రాయం వ్యక్తం చేశారు సిఐడి పోలీసులు.