లాటరీ తగల్లేదు.. కానీ ఒక్క రాత్రిలో కోటీశ్వరుడైన తెలుగు రైతు?

praveen
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది.  ఎంతో మంది తమకు అదృష్టం కలిసి రావాలి అంటూ దేవుని ఎన్నోసార్లు ప్రార్థిస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం కరుణించేది కొంతమందికి మాత్రమే. కొంత మంది అయితే అప్పటి వరకు నిరుపేదలుగా ఉన్న వారు ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు గా మారిపోయిన ఘటనలు కూడా ఎన్నో తెరమీదికి వస్తూ ఉంటాయి. ఒక రాత్రిలోనే కోటీశ్వరుడుగా మారిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో  లాటరీల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంది ఎంతోమంది దక్కడంతో కోటీశ్వరులు గా మారిపోతున్న ఘటనలు ఎక్కువగా వస్తున్నాయి.

 ఇక లాటరీ లాంటివి లేకుండా దాదాపుగా ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు గా మారడం చాలా కష్టం అని చెబుతూ ఉంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఒక రైతు మాత్రం లాటరీ అనే అదృష్టం వరించక పోయినప్పటికీ కోటీశ్వరుడు గా మారిపోయాడు. ఎన్నో రోజుల నుంచి పుడమితల్లి నమ్ముకుంటు వ్యవసాయం చేసుకుంటూ నలుగురికి అన్నం పెడుతున్న రైతన్న ఇక కోటీశ్వరుడు గా మారిపోయాడు.  దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు ఇటీవలే జాక్పాట్ తగిలింది.  అతని కష్టాన్ని చూసి ఆ దేవుడే వరం వచ్చినట్లు అయ్యింది.

 ఏకంగా ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు గా మారిపోయాడు ఆ పేద రైతు.  వజ్రం రూపంలో అతనికి అదృష్టం వరించింది. చిన్న జొన్నగిరి ప్రాంతంలో పని చేసుకుంటూ ఉండగా ఇక అతనికి ఒక విలువైన వజ్రం దొరికింది. ఇక దానిని సీక్రెట్గా వేలం వేయగా గుత్తికి చెందిన వ్యాపారులు 1.23 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. అయితే ఆ వజ్రం ధర మార్కెట్ లో మూడు కోట్ల ఉంటుందని సమాచారం. ఏదేమైనా పుడమితల్లి పైనే ఆధారపడి ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసి  రైతన్నకు దేవుడు వరమిచ్చినట్లుగా విలువైన వజ్రాలు దొరికి చివరికి కోటీశ్వరుడు గా మారిపోయాడు ఆ రైతు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: