గాంధీ ఆసుపత్రి డాక్టర్లు మామూలోళ్లు కాదండోయ్..!

frame గాంధీ ఆసుపత్రి డాక్టర్లు మామూలోళ్లు కాదండోయ్..!

Suma Kallamadi
ఒక పక్క యావత్ భారత దేశం కరోనా వైరస్ వ్యాప్తితో భయ బ్రాంతుల్లో ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా బ్లాక్ ఫంగస్ అనే కొత్త వ్యాధి ప్రజలను మరింత కలవర పెడుతుంది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు తెలంగాణలో మరి ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.కరోనా నుండి కొలుకున్న వారిలో ఈ బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. కొవిడ్‌ మరణాల్లో బ్లాక్‌ ఫంగస్ వలన సంభవించే మరణాలే అధికంగా నమోదు అవుతున్నాయి.ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రి  వైద్యులు పైసా ఖర్చు లేకుండా కొన్ని అరుదైన శాస్త్ర చికిత్సలు చేసి బ్లాక్‌ ఫంగస్‌ సోకిన కరోనా రోగి ప్రాణాలను నిలబెట్టారు. దాదాపు 6 గంటల పాటు శ్రమించి 3 అరుదైన శస్త్రచికిత్సలు చేసి అతనికి పునర్జన్మను ఇచ్చారనే చెప్పాలి.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన 45 సంవత్సరాల వయస్సుగల ఒక కరోనా సోకిన వ్యక్తి ఈనెల 19న 'గాంధీ’ఆసుపత్రిలో చేరాడు. వైరస్‌ నుంచి కోలుకుంటున్న సమయంలోనే అతను బ్లాక్‌ఫంగస్‌ బారినపడ్డాడు.దీంతో అతని ఎడమ దవడ వాయడంతో పాటు, ఎడమ కన్ను పూర్తిగా కనిపించకుండా పోయింది. కుడికన్ను మాత్రమే కొంచెం కనిపిస్తోంది.ఇంకా మిగతా భాగాలకు కూడా ఫంగస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కారణం చేత ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, పాస్లిక్‌ సర్జరీ, అనస్థీషియా, న్యూరోసర్జరీ వైద్యుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు.ఎండోస్కోపిక్‌ సైనస్‌, మాగ్జిలెక్టమి, ఆర్బిటల్‌ ఆక్సెన్‌ట్రేషన్‌ అనే మూడు శస్త్రచికిత్సలను ఏకకాలంలో నిర్వహించి విజయవంతంగా ఆ రోగి ఏడమవైపు కన్ను, దవడ భాగాన్ని పూర్తిగా తొలగించారు. అలాగే ఇన్‌ఫెక్షన్‌ సోకిన భాగాలను కొంతమేర తొలగించి, శుభ్రపరిచారు.


ఇలా ఒకే రోగికి ఒకేసారి మూడు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతాయని డాక్టర్లు తెలిపారు. నాలుగు విభాగాల వైద్యబృందాలు సుమారు 6 గంటల పాటు శ్రమించి ఈ శస్త్రచికిత్సలను చేసినట్టు ఆర్‌ఎంవో-1 డాక్టర్‌ నరేందర్‌కుమార్‌ తెలిపారు.కుటుంభ సభ్యులతో సహా అందరూ కూడా అతడిపై ఆశలు వదిలేసుకున్న క్రమంలో గాంధీ ఆసుపత్రిలోని డాక్టర్లు మాత్రం ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని విజయం సాధించారు.ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు, బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీ కమిటీ చైర్మన్‌ శోభన్‌బాబు ఆదేశాల మేరకు ఆర్‌ఎంవో–1 నరేందర్‌ ఈ వివరాలు వెల్లడించారు. బ్లాక్‌ఫంగస్‌ నియంత్రణకు పొసకొనజోల్‌ మందు ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నాడని,పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ చేసి ఆయా భాగాలను మళ్ళీ పునరుద్ధరిస్తామని వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: