ఆనందయ్య మందుపై సర్వత్రా ఉత్కంఠ..!

Suma Kallamadi
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ పరిస్థితులలో అందరికీ నెల్లూరు నాటువైద్యం తీపికబురు చెప్పింది. ఆ సంతోషం ఎన్నో రోజుల పాటు సాగలేదు. కరోనా సోకి చాలా మంది ప్రాణాలు విడుస్తున్న సమయంలో పసరు మందు కాపాడటం సంచలనం రేపింది. కృష్ణపట్నం ఆనందయ్య పేరు ప్రపంచ వ్యాప్తంగా పాకింది. పసరు మందుతో కొవిడ్ రోగులు పది నిమిషాల్లో కొలుకోవడం కలకలం రేపింది. ఇటువంటి సమయంలో కరోనా సోకిన వారు కృష్ణపట్నం వద్దకు క్యూ కట్టారు. రూపాయి కూడా తీసుకోకుండా ఆనందయ్య మందును ఇవ్వడం వల్ల ఇంగ్లీషు మందుల కంపెనీల వారు ముక్కుమీద వేలేసుకున్నారు. ఆ తర్వాత ఆనందయ్య మందుకు బ్రేక్ పడింది. ోఆనందయ్యపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయంటూ పలు కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందుపై ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌ అనుమతి కోసం హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేశారు. కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారని, ఈ మందు తీసుకుని అనేక మంది కోలుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. అకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసిందని, దీనివల్ల అనేక మంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఆనందయ్య మందు పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఆయుష్ తేల్చింది. ఆనందయ్య వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని పరిశీలించిన ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలను వాడటం లేదని వెల్లడించారు. అయినప్పటికీ శాస్త్రీయత ధృవీకరణ జరిగే వరకు ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామని రాములు చెప్పారు. అలాగే ఐసీఎంఆర్ సైతం ఈ మందుపై పరిశోధనలు చేస్తోంది.మరో వైపు ప్రజలు ఈ మందు మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తోందోనని ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: