ఫంగస్ రకాల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎయిమ్స్ ...

VAMSI
ఇప్పటికే దేశంలో కరోనా బీభత్సంతో ప్రజలు వణికిపోతుంటే మరోవైపు ఎల్లో ఫంగస్,  వైట్ ఫంగస్ అంటూ పేర్లు పెట్టి ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. వాస్తవానికి ఇవేమీ ప్రాణాంతకమైన ఫంగస్ లు కావని, ఫంగస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగులో ఉంటుంది అని స్పష్టం చేశారు. అక్కడ  పరిస్థితులపై ఆ ఫంగస్ యొక్క రంగు ఆధారపడి ఉంటుందే తప్ప ఇవేవీ మరో కొత్త ఫంగస్ లు కాదు. కానీ ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ అని రంగుల పేర్లతో వీటిని కొత్త ఫంగస్ లుగాచూపెట్టి ప్రజల్ని  భయపెడుతున్నారు అని గులేరియా దుయ్యబట్టారు. 


దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి కాదని ఆయన మరో సారి స్పష్టం చేశారు. వాస్తవానికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు మూడు రకాలుగా ఉన్నాయని వివరించారు.  మొదటి రకం మ్యూకార్ మైకాసిస్ అని, రెండవ రకం  కాండిడా అని, ఇక మూడవ రకం  ఆస్పర్ జిల్లోసిస్ అని తెలియజేశారు. అయితే ప్రస్తుతం కరోనా నుండి కోలుకుంటున్న రోగులలో కనిపిస్తున్న ఫంగస్ మొదటి రకమైన మ్యూకార్ మైకాసిస్ అని చెప్పారు.

ఇక థర్డ్ వేవ్ గురించి ఇప్పటికే అతిభయకరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని, మూడవ దశలో పిల్లలపై  కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుదన్న
వార్తలను ఈయన ఖండించారు.  పీడియాట్రిక్స్ అసోసియేషన్  నివేదిక ప్రకారం వారు తెలియజేసింది ఏమిటంటే, థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ ఈ దశలో పిల్లలపై కరోనా పెద్దగా ప్రభావం చూపబోదని వారు స్పష్టం చేశారు. కాబట్టి తల్లి తండ్రులు అసత్య ప్రచారాలు నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పిల్లల్లో ఏమైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించండి. పాజిటివ్ వస్తే డాక్టర్ ను సంప్రదించి దానికి తగిన చికిత్సను తీసుకోండి అని తల్లితండ్రులకు సలహా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: