రఘురామ రాజు గాయాలపై పలు వాదనలు ?
ఈ ఎయిర్ లైన్ ఫ్రాక్చర్స్ రావడానికి కారణం కొట్టడమేనని అక్కడి వైద్యులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారనే విషయం మీడియా వర్గాలు హైలైట్ చేస్తున్నాయి. జ్యూడిషియల్ అధికారి నాగార్జున నేతృత్వంలో రఘురామ కృష్ణం రాజుకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారన్న విషయం కూడా వీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఈ వైద్య పరీక్షలను వీడియో తీసారని తెలుస్తోంది. తదుపరి సుప్రీం కోర్ట్ ఆదేశాలు వచ్చేంత వరకు రఘురామ కృష్ణం రాజును మిలిటరీ హాస్పిటల్ లోనే ఉంచి చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది రఘురామ అనుకూల మీడియా మరియు అభిమానుల వాదన. మరో వైపు వైసీపీ అభిమానులు కావొచ్చు లేదా వైసీపీ నాయకులు కావొచ్చు చెబుతున్నదేమిటంటే, రఘురామ కృష్ణం రాజు అధికారులను తప్పు దోవ పట్టించేందుకు కావాలనే అబద్దాలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈయనకు జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు, కేవలం హార్ట్ కి స్టంట్లు వేశారని చెబుతున్నారు.
గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ లీగల్ నాయకుడు భార్య చెప్పేది పచ్చి అబద్దమని, ఆ సూపరింటెండెంట్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరుడని చెప్పారు. రఘురామ రాజు కాళ్లపై గాయాలున్నాయని సిఐడి మేజిస్ట్రేట్ ఎక్కడా పేర్కొనలేదని, మరియు టెండర్ నెస్ ఉండదని మాత్రమే రిపోర్ట్ లో రాశారని చెప్పుకొచ్చారు. అంతకు ముందు రఘురామ రాజు సిఐడి మేజిస్ట్రేట్ దగ్గరకు నడుచుకుంటూనే వచ్చారని, ఎప్పుడైతే బెయిల్ పిటీషన్ రద్దయిందని టీడీపీ లాయర్ చెప్పారో, ఆ క్షణం నుండి ఆయనను కొట్టినట్లు నాటకమాడారని చెప్పారు. ఈయనకు అన్ని రకాల న్యాయసలహాలు ఇస్తున్నది టీడీపీ లాయర్లే, జైలు లోపల బయట కలుస్తున్నది కూడా వీళ్ళేనని రఘురామ వ్యతిరేకులు చెబుతున్నారు. ఇలా వీరి వాదనలు మరియు ఆరోపణలు జరుగుతున్నాయి. అయితే ఫైనల్ గా సుప్రీం కోర్ట్ దగ్గరకు నివేదిక వచ్చిన తరువాత అసలు విషయం తేలనుంది. ఒకవేళ రఘురామ రాజును కొట్టి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, సిఐడి మరియు డాక్టర్స్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదా కొట్టలేదని తేలితే రఘురామ కృష్ణం రాజు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమి జరగనుందో చూడాలి.