హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారా.. అయితే ఆ మందు అస్సలు వాడకండి?
ఇలాంటి నేపథ్యంలో ఇక ఆస్పత్రిలో చేరి పరిస్థితి విషమించిన వారికి రెమిడీసివర్ ఇంజక్షన్ లతో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇకపోతే అదే సమయంలో ఎంతో మంది కరోనా వైరస్ బారిన పడినప్పటికీ స్వల్ప లక్షణాలు ఉండటంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇలా హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారు కూడా రెమీడిసివర్ ఇంజక్షన్లనూ ఎక్కువగా వాడుతున్నారు. వారికి అందించిన మందులను కాకుండా రెమిడీసివర్ లాంటి ఇంజెక్షన్లను కూడా తీసుకోవడమే కాదు ఇంట్లో నిల్వలు కూడా ఉంచుకుంటున్నారు. అయితే ఇలా హోమ్ ఐసొలేషన్ లో ఉంటూ రేమిడిసివర్ తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని సూచిస్తున్నారు నిపుణులు.
కరోనా వైరస్ ఔషధాల కొరత నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారు రేమిడిసివర్ వాడొద్దని... లక్షణాలు ఉన్నవారికి కూడా రెమెడీసివర్ అవసరం లేదు అంటూ వైద్యులు సూచిస్తున్నారు. 94 శాతం కన్నా ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు ఇతర వ్యాధులతో బాధపడుతూ తీవ్రంగా అనారోగ్యం బారినపడిన వారు మాత్రమే రెమెడిసివర్ వాడాలి అంటూ సూచించారు. అంతేకాకుండా రెమిడీసీవర్ ఇంజక్షన్ తగిన మోతాదులో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరం అనిపిస్తే తప్ప ఆస్పత్రిలో చేరవద్దు అంటూ చెబుతున్నారు.