సీఐడీకి అవేమి వినిపించ‌డంలేదా...? మాజీ మంత్రి అయ్య‌న్న‌

N.V.Prasd
అమ‌రావ‌తి : ఏపీలో పోలీస్‌, సీఐడీ, ఏసీబీ వ్య‌వ‌స్థ‌లు ముఖ్య‌మంత్రి చేతిలో కీలుబొమ్మ‌లుగా మారాయని మాజీ మంత్రి చింత‌కాయల అయ్య‌న్న‌పాత్రుడు అన్నారు. న్యాయ‌స్థానాలు,గ‌వ‌ర్న‌ర్ చెప్పినా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వినే స్థితిలో లేర‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న రాజ్యాంగ అస్థిర‌త చ‌ర్య‌ల‌పై రాష్ట్ర‌ప‌తి జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కక్షసాధింపుచర్యలు, సైకోచేష్టలు, వ్యవస్థ‌ల‌ను తనచేతిలో పెట్టుకొని ఆడిస్తున్న తీరుపై రాజ్యాంగానికి ప్రతినిధులుగా ఉన్నవారు స్పందించకపోతే ఎలాగ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.ఎంపీని అరెస్ట్ చేసేముందు లోక్ సభ స్పీకర్, కేంద్రహోం మంత్రి అనుమతి తీసుకోవాల‌ని...అదేమి లేకుండా పోలీసులు అక్ర‌మంగా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుని అరెస్ట్ చేశార‌ని ఆరోపించారు.
రఘురామరాజు మాట్లాడిన దానిలో త‌ప్పేమిలేద‌ని...ముఖ్యమంత్రి చర్యలు, ఏకపక్ష విధానాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడం తప్పెలా అవుతుందని అయ్య‌న్నపాత్రుడు అన్నారు. రఘురామరాజు చేసింది త‌ప్ప‌యితే ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డి,ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల‌ రామకృష్ణారెడ్డి లు చేసింది అంతకంటే పెద్ద తప్పుకాదా అని ప్ర‌శ్నించారు.ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ మోహ‌న్‌ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని ఉద్దేశించి చాలామాట‌లు మాట్లాడార‌న్నారు.చీపుర్లతో తరిమికొట్టాలని, రాళ్లతో కొట్టాలని, కాల్చిచంపాలని, బంగాళాఖాతంలో విసిరేయాలని, చంద్రబాబుకి అంతిమఘడియలు లాంటి మాట‌లు మాట్లాడార‌ని గుర్తు చేశారు. మరి ఆనాడు సీఐడీ అధికారులు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్ర‌శ్నించారు.మంత్రి కొడాలినాని చంద్రబాబుని ఉద్దేశించి అనరాని మాటలంటే సీఐడీకి అవేవి వినిపించడం లేద‌ని...రఘురామరాజుపై అధికారపార్టీ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ లుపెట్టించింది సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డేన‌ని ఆరోపించారు.
ప్రశ్నించిన ప్రతిఒక్కడిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపి, వారు కరోనాతోచనిపోయేలా చేస్తే, వారి కుటుంబాలకు దిక్కెవరని మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు ప్ర‌శ్నించారు.ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రిని ప్రశ్నించాడని, నిలదీస్తున్నాడని రఘురామరాజుని అరెస్ట్ చేస్తే ప్రజలు భయపడ‌ర‌ని...రాష్ట్రంపై అభిమానం, ప్రజలగురించిఆలోచించే తత్వమున్న ప్రతిఒక్కడూ ముఖ్యమంత్రిని, ఆయనప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటార‌న్నారు. రెండేళ్ల  పాలనపై విసిగిపోయిన కొందరు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బూతులు తిడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: