దేవుడు కాదు అంతకుమించి.. ప్రభుత్వాలు చేయలేనిది కూడా చేస్తున్నావ్?
ఇక రోజు రోజుకు ఆసుపత్రులకు వెళ్తున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ కొరకు ఏర్పడుతున్న పరిస్థితులు వస్తున్నాయ్. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు ఇలాంటి నేపథ్యంలో దేశంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. అయితే కరోనా వైరస్ కష్టకాలంలో మొదటి నుంచి ఎంతో మంది ప్రజలను ఆదుకుంటూ ఆపద్బాంధవుడిగా మారిపోయిన సోను సూద్ ప్రస్తుత సమయంలో కూడా మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు.
ఇప్పటికే ఆక్సిజన్ అందక ఆసుపత్రులలో ఎంతోమంది కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సోను ఒక గొప్ప ఆలోచన కు శ్రీకారం చుట్టారు. సిలిండర్లు ఆక్సీజన్ సరఫరా మాత్రమే కాకుండా రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పాలని డిసైడయ్యారు సోనుసూద్. దీని కోసం ఫ్రాన్స్ నుంచి సామాగ్రిని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఇతర దేశాల నుంచి వివిధ రకాల పరికరాలను కూడా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు. మరో రెండు వారాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు సూచించిన రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు సత్వరమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.