ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సర్వీసులపై సస్పెన్షన్ పొడిగింపు : డీ.జి.సి.ఏ

Purushottham Vinay
దేశంలో కరోనా కేసులు మితి మీరిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాలు అంత సురక్షితం కాదు. ఇక అలాగే దేశంలో కరోనా సంక్షోభం తలెత్తడం, ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరత వంటి సమస్యల నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజా ఆదేశాలిచ్చింది.ఇక కరోనా కేసుల పెరుగుదల కారణంగా 2020 మార్చి 23న అంతర్జాతీయ విమాన సర్వీసులను సస్పెండ్ చేశారు.అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన సస్పెన్షన్‌ను మే 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారంనాడు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 'కేస్ టు కేస్' ప్రాతిపదకపై ఎంపిక చేసిన రూట్లలో ఇంటర్నేషనల్ షెడ్యూల్డ్ ఫ్లయిట్ల్‌ను అనుమతించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, డీజీసీఏ ఆమోదం పొందిన కార్గో ఆపరేషన్లు, విమానాలకు సస్పెన్షన్ ఆంక్షలు వర్తించవని తెలిపింది.

ఇక అలాగే 'వందే భారత్ మిషన్' కింద సెంట్రల్ గవర్నమెంట్ గత మే నుంచి దైపాక్షిక 'ఎయిర్ బబుల్' ఏర్పాట్ల కింద ఎంపిక చేసిన దేశాలకు ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది. ఇంతవరకూ అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాలను ఇండియా చేసుకుంది. అయితే, కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో, పలు దేశాలు కోవిడ్ పరిస్థితి మెరుగయ్యేంతవరకూ ఎయిర్ బబుల్ ఒప్పందం కింద ఇండియా నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. కాగా, తమ అనుమతి పొందిన అంతర్జాతీయ కార్పో ఆపరేషన్లు, విమానాలపై ఈ ప్రభావం ఉండదని డీజీసీఏ తాజా సర్క్యులర్‌లో పేర్కొంది.ఇక ఇండియాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్న దృష్ట్యా వచ్చే మూడు వారాలు అన్ని డైరెక్ట్ ప్యాసింజర్ ఫ్లయిట్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తాజాగా ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: