మీకు కరోనా సోకిందా...అయితే ఈ మూడు విషయాలు తప్పక తెలిసుండాలి...?

VAMSI
ఇప్పుడు మొదలైన కరోనా సెకండ్ వేవ్ ఉత్తి పుణ్యానికి  అంటుకుపోతోంది. చిన్న పొరపాటు చేసినా చిటికెన వెలు పట్టుకుని మరి మన ఇంటికి వచ్చేస్తోంది. ప్రతి నిమిషం ఎంతో జాగ్రత్త వహిస్తే తప్ప ఈ కరోనా బెడద నుంచి తప్పించుకోలేము. కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి. బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్, సానిటైజెర్, భౌతిక దూరం పాటించడమే కాదు...బయట ఫుడ్ తినడం పూర్తిగా మానేయండి. ఒకవేళ మీకు కరోనా సోకితే మూడు విషయాలను మాత్రం ఎట్టి  పరిస్థితుల్లో మరచిపోకండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, మూల్యంగా మన జీవితాన్నే కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇంతకీ ఆ మూడు ముఖ్య విషయాలు ఏమిటి అంటే...  మొదటిది... కరోనా లక్షణాలు కనిపించినా లేదా పాజిటివ్ అని నిర్ధారణ అయినా.. వెంటనే ఇంట్లో  రెండు, మూడు గదులు ఉన్నవారు  హోమ్‌ క్వారంటైన్‌ కావాలని ఐసీఎంఆర్‌ సూచించింది. దీని ద్వారా మన కుటుంబసభ్యులకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ ఒకే గదిలో అందరితో పాటు ఉండాల్సి వస్తే మాస్క్ ఎప్పుడూ మీ ముఖానికి ఉండాలి, అలాగే శానిటైజర్ తరచూ రాసుకుంటుండాలి. ఇతర వస్తువులను తాకడం మంచిది కాదు. కొద్దిపాటి జ్వరం, ఒళ్లు, నొప్పులు లాంటి లక్షణాలున్నవారు నొప్పులను, జ్వరాన్ని తగ్గించే డోలో 650 ఎంజీ వంటి మాత్రలు, రోజుకి నాలుగైదు సార్లు అవిరి పట్టుకోవడం...వీలైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చేయాలని వైద్యులు చెబుతున్నారు.

రెండవది...వ్యాధినిరోధక శక్తిని పెంచే పోషకాహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, గుడ్లు తినాలి. రోజుకు నాలుగు లీటర్ల నీరు తప్పక తాగాలి. కాఫీ కూడా తాగడం మంచిదే. గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, మినప వడలు వంటివి తినాలి. మూడవ విషయం... జ్వరం తీవ్రత మరింత పెరిగినా...దాంతోపాటు బరించలేని చలి, దగ్గు ఎక్కువ అయ్యి..  శ్వాస పీల్చుకోవడం కష్టతరం అనిపించినపుడు...  ఛాతి నిరంతర నొప్పి పుట్టడం, చాలా నీరసంగా కనీసం లేచి కూర్చోలేక పోవడం,  చర్మం పాలిపోవడం, బూడిద రంగులోకి మారడం లేదా చర్మం నీలం రంగులోకి మారడం, పెదాలు, గోళ్లు రంగు మారడం...వంటివి ప్రమాద స్థాయికి సంకేతాలు. ప్రధానంగా  మీ వద్ద పల్స్‌ ఆక్సీమీటర్‌ ను ఉంచుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఊపిరి తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది ఏర్పడినా.. ఆక్సిజన్‌ లెవల్స్‌ 92 శాతం కన్నా తక్కువగా ఉన్నా అది ప్రమాదం పెరుగుతున్నట్లు సంకేతం...కాబట్టి వెంటనే  హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ను సంప్రదించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ధైర్యంగా...పాజిటివ్ గా ఆలోచిస్తే ఎంతటి ప్రమాదకర స్థితి నుందినయినా బయటపడగలము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: